అవ‌కాశం కోసం ప్రాథేయ‌ప‌డుతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

సినిమాల్లో అవ‌కాశం బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, హిందీ న‌టి హీనాఖాన్ ప్రాథేయ‌ప‌డుతున్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుం టున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత నెపోటిజంపై ప‌లువురు సెల‌బ్రిటీలు బాలీవుడ్‌లో అణ‌చివేత‌పై గ‌ళం…

సినిమాల్లో అవ‌కాశం బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, హిందీ న‌టి హీనాఖాన్ ప్రాథేయ‌ప‌డుతున్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుం టున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత నెపోటిజంపై ప‌లువురు సెల‌బ్రిటీలు బాలీవుడ్‌లో అణ‌చివేత‌పై గ‌ళం విప్పుతున్నారు. తాజాగా హీనాఖాన్ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ముందుకొచ్చారు.

జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ సుశాంత్‌ సినీ ప్రయాణం తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ‘ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ఎంతో శ్ర‌మించి ఉన్నతస్థాయికి ఎదిగాడు. మేం బయటివాళ్లం. మాకు గాడ్‌ఫాదర్లు ఉండరు. కాస్త గుర్తింపు, కొద్దిపాటి గౌరవం మాత్రమే మేం కోరుకుంటాం. కాబట్టి అందరినీ సమానంగా చూస్తే ఇలాంటివి జరగవు’ అంటూ హీనా ఖాన్ ఆవేద‌న‌తో చెప్పుకొచ్చారు.

‘ఒక్క సినీ ప‌రిశ్ర‌మ‌ను మాత్ర‌మే నిందించి ప్ర‌యోజ‌నం లేదు. ఎందుకంటే ఎక్కడా సమానత్వం లేదు.  అన్నిచోట్లా బంధుప్రీతి ఉంది. మీరు ఓ స్టార్‌ అయితే మీ కొడుకు లేదా కూతురిని సినిమాల్లోకి తీసుకొస్తారు. దాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. అభ్యంత‌రం ఎక్క‌డంటే తాము త‌ప్ప మ‌రెవ‌రూ ఇండ‌స్ట్రీలో ఉండ‌కూడ‌ద‌నుకోవ‌డ‌మే.  టీవీ నటులు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం చాలా పెట్ట టాస్క్‌.  మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి కనీసం ఒక్క ఛాన్స్‌ అయినా ఇవ్వొచ్చు కదా’ అంటూ  హీనా ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

బాలీవుడ్‌లో ఎంట‌ర్ కావ‌డం ఎంత క‌ష్ట‌మో హీనా ఖాన్ ఆవేద‌న ప్ర‌తిబింబిస్తోంది. ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల వైఖ‌రిలో ఏ మాత్రం మార్పు రావ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మున్ముందు బాలీవుడ్‌లో నాన్ ఇండ‌స్ట్రీకి చెందిన న‌టీన‌టులకు అవ‌కాశం ద‌క్క‌డం అంత సుల‌భం కాక‌పోవ‌చ్చు.

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది

వైఎస్సార్ జయంతి వేడుకలు