Advertisement

Advertisement


Home > Movies - Movie News

హిరణ్య కశ్యప....ఆగిందా...?

హిరణ్య కశ్యప....ఆగిందా...?

రానా కీలకపాత్రలో, గుణశేఖర్ డైరక్షన్ లో సురేష్ బాబు నిర్మాణంలో ప్లాన్ చేసారు హిరణ్య కశ్యప సినిమాను. ఇందులో రావణాసురుడి పాత్ర రానా ది. 

శాకుంతలం సినిమా చేస్తన్న గుణశేఖర్ ఆ తరువాత ఈ ప్రాజెక్టు చేయలనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ఆగిందని తెలుస్తోంది. దీనికి కారణం నిర్మాత సురేష్ బాబుకి స్క్రిప్ట్ నచ్చకపోవడమే అని తెలుస్తోంది.

గుణశేఖర్ తయారుచేసిన స్క్రిప్ట్ పాత లవకుశ సినిమాకు రీమిక్స్ మాదిరిగా వుందని, అలా కాకుండా మరో స్క్రిప్ట్ ఇచ్చి దానితో సినిమా చేయమని సురేష్ బాబు కోరినట్లు తెలుస్తోంది. దానికి గుణశేఖర్ అంగీకరించలేదు. దాంతో ఆ విధంగా ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టారని తెలుస్తోంది. 

శాకుంతలం సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సమంత కీలకపాత్ర అయిన శకుంతల గా నటిస్తోంది. ఈ సినిమా కనుక హిట్ అయితే హిరణ్య కశ్యప సినిమాను కూడా నిర్మించే ఆలోచన దిల్ రాజు చేస్తారని బోగట్టా. లేదంటే లేదు. హిరణ్య కశ్యపను గుణశేఖర్ నే స్వంతంగా నిర్మించుకోవాల్సి వుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?