Advertisement

Advertisement


Home > Movies - Movie News

'ప్రత్యేక' పాత్రలపై క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్

'ప్రత్యేక' పాత్రలపై క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్

ఇన్నాళ్లూ హీరోగా మాత్రమే కనిపించారు. త్వరలోనే విలన్ గా కూడా కనిపిస్తారని, మంచి ప్రత్యేక పాత్రల్లో కూడా  మెరుస్తారంటూ రాజశేఖర్ పై ఏళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ దిశగా ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు రాజశేఖర్. దీనికి కారణం ఏంటి?

"నేను క్యారెక్టర్ రోల్స్ చేస్తానా లేదా అనేది చాలామందికి డౌట్. అలా డౌట్స్ క్లియర్ చేసుకొని వచ్చే వాళ్లు మంచి క్యారెక్టర్స్ చెప్పడం లేదు. రాజశేఖర్ వింటారు కానీ చేయరు అని కొందరు అనుకుంటున్నారు. ఈ పద్ధతి ఇలానే ఉంటే నేనేం చేయలేను. ఈ పద్ధతిని మార్చే పాత్ర వస్తే, అప్పుడు అందరూ తెలుసుకుంటారు. నేను ఎలాంటి పాత్రలు కోరుకుంటున్నానో అర్థమౌతుంది. అలాంటి పాత్ర వస్తుందనే అనుకుంటున్నాను."

ఇలా స్పెషల్ క్యారెక్టర్లకు సంబంధించి తనపై జరుగుతున్న ప్రచారాన్ని అంగీకరించారు రాజశేఖర్. తన దగ్గరకు వంద కథలొచ్చినా, మనసుకు నచ్చిన పాత్ర దొరక్కపోతే చేయనన్నారు.  

"సినిమాలు నేను తగ్గించలేదు. అలా అయిపోతోంది. వంద మంది వచ్చి కథలు చెబుతున్నారు కానీ ఆ పాత్ర నాకు  నచ్చాలి కదా. ఇష్టం లేకుండా చేస్తే బాగుండదు. ప్రత్యేక పాత్రల్లో నటించాలని నిర్ణయం తీసుకొని నేను ఒక అడుగు ముందుకేశాను. కానీ వచ్చే వాళ్లంతా నా ఇమేజ్ ను వాడుకుందామని అనుకుంటున్నారు తప్ప మంచి పాత్రలు తీసుకురావడం లేదు. ధృవలో అరవింద్ స్వామి చేసిన లాంటి పాత్ర వస్తే ఎందుకు కాదంటాను."

తాజాగా శేఖర్ సినిమా చేశారు రాజశేఖర్. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రచారం కోసం ఆయన మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా క్యారెక్టర్ రోల్స్ పై తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు. మంచి పాత్రలు దొరికితే చేయడానికి సిద్ధమంటున్నారు. 

గోపీచంద్-శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటించడానికి రాజశేఖర్ దాదాపు అంగీకరించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ క్యారెక్టర్ కోసం జగపతిబాబును తీసుకున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?