ఓ సినిమా హిట్ అయిందా? లేదా? అంటే కొలమానం వసూళ్లు. బయ్యర్లు గట్టెక్కడమే. ఆ లెక్కన చూసుకుంటే ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో హిట్ 2 ఫ్లాప్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర లోని ఆరు ఏరియాలు అలాగే సీడెడ్ లో ఎక్కడా హిట్ 2 బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కాలేకపోయారు.
సినిమా విడుదలై పది రోజులు దాటింది. వాస్తవానికి తొలి మూడు రోజుల తరువాతనే హిట్ 2 కలెక్షన్లు బిళ్ల బీటుగా పడిపోయాయి. తరువాత హీరో శేష్ చాలా గట్టిగా ప్రయత్నించినా అలా అలా నడిచింది తప్ప బయ్యర్లను గట్టెక్కించలేకపోయింది.
విశాఖలో ఈ సినిమాను రెండు కోట్లకు కాస్త తక్కువగా ఇచ్చి దిల్ రాజు కొన్నారు. అక్కడ దాదాపు ఓ పాతిక లక్షలు ఆ పైనే నష్టం వుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మిగిలిన ప్రాంతాలది కూడా అదే పరిస్థితి. సీడెడ్ లో బయ్యర్ కిందకు కొంత అమ్మేసి బయటపడిపోయారు. కానీ కొనుక్కున్నవాళ్లు దొరికిపోయారు. కృష్ణా జిల్లా కొనుక్కుని, అన్నపూర్ణ దగ్గర పెట్టారు. అక్కడ కూడా నష్టమే తప్పలేదు.
నైజాంలో మాత్రం నేరుగా పంపిణీ చేసుకున్నారు. అక్కడ మాత్రం మంచి మొత్తమే లభించింది. ఓవర్ సీస్ లో వన్ మిలియన్ దాటడం వల్ల అక్కడ లాభం కనిపించింది. లిమిటెడ్ జానర్, కాస్త బ్లడ్ షెడ్ ఎక్కువ వుండడం వల్ల కావచ్చు..ఆంధ్ర, సీడెడ్ ల్లో జీఎస్టీ నిర్మాత కట్టుకున్నా కూడా బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.