Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

కేడీని ముప్పుతిప్పలు పెడుతున్న కోడి బుర్ర

కేడీని ముప్పుతిప్పలు పెడుతున్న కోడి బుర్ర

హీరోను విలన్ కెలికితే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. మరి విలన్ ను హీరో కెలికితే ఎలా ఉంటుంది? కొద్దిసేపటి కిందట విడుదలైన హిట్-2 ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా నుంచి ట్రయిలర్ రిలీజ్ అయింది. ట్రయిలర్ ప్రారంభంలో విలన్ ను కోడిబుర్రతో పోలుస్తాడు హీరో, '5 నిమిషాలు చాలు పట్టుకోడానికి' అని స్టేట్ మెంట్ కూడా ఇస్తాడు.

అదే కోడి బుర్ర, హీరోను ముప్పుతిప్పలు పెడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ను హిట్-2లో చూడబోతున్నారు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? కేడీ అతడ్ని ఎలా పట్టుకున్నాడనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రయిలర్ కట్ చేశారు.

ఊహించని మలుపులతో, అద్భుతమైన సెటప్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వచ్చిన 'హిట్' సినిమా, సూపర్ హిట్టయింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు హిట్.. ది సెకెండ్ కేస్ సినిమాను తెరకెక్కించారు. మొదటి భాగంలో చూపించినట్టుగానే, హిట్-2లో కూడా చాలా లోతుగా డీటెయిలింగ్ ను చూపించాడు దర్శకుడు శైలేష్ కొలను. ట్రయిలర్ చూస్తే ఆ విషయం అర్థమౌతుంది.

డిసెంబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా సీట్-ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెబుతున్నారు మేకర్స్. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని నిర్మించిన ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?