హిట్ 3 భారీ బిజినెస్

హిట్ 3 సినిమాకు నానికి రెమ్యూనిరేషన్ వచ్చేయగా మిగిలే లాభం 35 కోట్ల మేరకు.

హిట్ 3.. నాని నటిస్తున్న సినిమా మాత్రమే కాదు.. కర్త కర్మ క్రియ నానినే దగ్గర వుండి చూసుకుంటున్న సినిమా. ఓ పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం తనే దగ్గర వుండి చూసుకుంటున్నారు. అందువల్లే ఈ సినిమా నాని రెమ్యూనిరేషన్ పక్కన పెడితే చాలా రీజనబుల్ బడ్జెట్ లో పూర్తయింది. నాని రెమ్యూనిరేషన్ కాకుండా జస్ట్ 60 కోట్లకు కాస్త అటుగా బడ్జెట్ అయింది. అంతే.

అసలు ఇంత కూడా కాకపోను. విదేశీ టెక్నీషియన్లతో తీసిన క్లయిమాక్స్ కే ఎనిమిది కోట్లు ఖర్చయింది. అలాగే ఈ సినిమాలో అడవి శేష్ కొద్ది సేపు కనిపిస్తారు. గతంలో హిట్ సిరీస్ లో అడవి శేష్ పూర్తి నిడివి పాత్ర చేసినపుడు ఇచ్చిన రెమ్యూనిరేషన్ కన్నా కాస్త ఎక్కువే ఇచ్చారు.

ఇదిలావుంటే సినిమాను జస్ట్ ఓటిటి ఆదాయమే 54 కోట్లు వచ్చింది. అడియో హక్కులు ఆరు కోట్లు వచ్చాయి. అంటే దాదాపు నిర్మాణ వ్యయం అంతా వెనక్కు వచ్చేసింది. ఇంకా శాటిలైట్ వుంది. హిందీ హక్కులు వున్నాయి. అవన్నీ కలిస్తే నాని రెమ్యూనిరేషన్ వచ్చేస్తుంది, థియేటర్ హక్కుల రూపంలో వచ్చేదంతా లాభమే.

ఏపీ థియేటర్ హక్కులు 10 కోట్లు చెబుతున్నారు. సీడెడ్ అయిదు కోట్లకు ఇచ్చేసారు. ఓవర్ సీస్ 10 కోట్లకు విక్రయించారు. నైజాం కూడా పది కోట్ల రేంజ్ లో వుంటుంది. దాదాపు థియేటర్ మీద 35 కోట్లు…

అంటే హిట్ 3 సినిమాకు నానికి రెమ్యూనిరేషన్ వచ్చేయగా మిగిలే లాభం 35 కోట్ల మేరకు. ఇదంతా కేవలం నాని వల్లే. ఎందుకంటే దర్శకుడు శైలేష్ అంతకు ముందు తీసిన సైంధవ్ దారుణమైన డిజాస్టర్. దాని వల్ల నిర్మాత దారుణంగా నష్టపోయారు. అయితే శైలేష్ కథను తీసుకుని, నాని అన్నీ తానై వ్యవహరిస్తూ హిట్ 3 ని ముందుకు తీసుకెళ్తున్నారు.

2 Replies to “హిట్ 3 భారీ బిజినెస్”

Comments are closed.