ప‌వ‌న్ బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం.. డీజీపీ, సీఐడీ చీఫ్ వెళ్ల‌రా?

స‌చివాల‌యంలోని ప‌వ‌న్‌క‌ల్యాణ్ శాఖ‌కు సంబంధించిన బ్లాక్‌కు డీజీపీ, సీఐడీ చీఫ్‌ను ఇంకా చంద్ర‌బాబు పంప‌లేదా?

ఇవాళ ఉద‌యం రాష్ట్ర స‌చివాల‌యంలో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు జ‌న‌సేన సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. గ‌తంలో కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌రేట్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ్గా, సీఎం చంద్ర‌బాబు చేసిన హడావుడి అంతాఇంతా కాదు.

మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ముఖ్య‌మైన రెవెన్యూ ఫైల్స్ ద‌గ్ధ‌మ‌య్యాయేమో చూడాలంటూ డీజీపీ, సీఐడీ చీఫ్ త‌దిత‌రుల్ని హెలికాప్ట‌ర్‌లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న సీఎం పంపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డే ఈ ప‌ని చేసి వుంటార‌ని, త‌న‌కు సంబంధించిన అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌నే నిప్పు పెట్టి వుంటార‌ని సీఎం బాబు, రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ త‌దిత‌రులు ఆరోపించారు.

ఇప్పుడు అట‌వీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సంబంధించిన బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డం వెనుక ఎవ‌రి కుట్ర వుంటుంద‌నే చ‌ర్చ‌కు దారి తీసింది. కీల‌క‌మైన ఫైళ్ల‌ను ద‌గ్గం చేసిందెవ‌రు? దీని వెనుక ఎవ‌రి కుట్ర వుందో తేల్చాల‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అట‌వీశాఖ‌కు సంబంధించి ముఖ్య‌మైన ఫైల్స్ ద‌గ్గం అయ్యాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

స‌చివాల‌యంలోని ప‌వ‌న్‌క‌ల్యాణ్ శాఖ‌కు సంబంధించిన బ్లాక్‌కు డీజీపీ, సీఐడీ చీఫ్‌ను ఇంకా చంద్ర‌బాబు పంప‌లేదా? పంపాల‌ని అనుకోలేదా? అనే ప్ర‌శ్న కూడా ఎదుర‌వుతోంది. కానీ ప‌వ‌న్ బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం వెనుక ఏదో జ‌రిగింద‌న్న అనుమానాల‌కు అగ్గి రాజుకుంది. మ‌రోవైపు ఈ దుర్ఘ‌ట‌న వెనుక కూడా జ‌గ‌న్ లేదా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నార‌ని కూట‌మి నేత‌లు ఇంకా ఆరోపించ‌లేదా? అని వైసీపీ యాక్టివిస్టులు దెప్పి పొడుస్తున్నారు

19 Replies to “ప‌వ‌న్ బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం.. డీజీపీ, సీఐడీ చీఫ్ వెళ్ల‌రా?”

  1. Mana mbpissad re gu lar arti cles rel ease che sth un nadu hi st ory and mov ies paina… Hi d den reas on is to g et rea dy to rel ease co ntin uous a rti cles on koot ami….. Inka put tal loninchi che em alu vast hayi bai taki.

  2. Mana m.b pissad re gu lar arti cles rel ease che sth un nadu hi st ory and mov ies paina… Hi d den reas on is to g et rea dy to rel ease co ntin uous a rti cles on koot ami….. Inka put tal loninchi che em alu vast hayi bai taki.

  3. Mana m.b pi ss ad re gu lar arti cles rel ease che sth un nadu hi st ory and mov ies pai na… Hi d den reas on is to g et rea dy to rel ease co ntin uous a rti cles on koot ami….. Inka put tal loninchi che em alu vast hayi bai taki.

  4. లోక్సభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకం..

    రాజ్యసభ లో వక్ఫ్ బిల్లుకు అనుకూలం..

    వాహ్ జగనన్నా వాహ్.. 13 ఏళ్లుగా బెయిల్ మీద బతికేస్తున్నావు.. నీ రహస్యం ఇదా..

    ..

    న్యూట్రల్ జర్నలిస్టులు గారు.. ఎంబీఎస్ ప్రసాద్ గారు.. మీ చిలక పలుకులు పలకలేరా..

      1. ఓహ్.. వైవీ సుబ్బారెడ్డి గురించేనా.. అన్ని అబద్ధాలు చెపుతుంటాడు..

        అయినా.. జగన్ రెడ్డి చేసే వింతలు విడ్డూరాలు అన్నీ నీకు చెప్పి చేస్తారా జగలక్ చెల్లి గారు..

        రాజ్యసభ లో వచ్చిన ఓట్లు లెక్కలేస్తే.. వేళ్ళన్నీ జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి.. ఒకసారి నేషనల్ చానెల్స్ కూడా చూడు ..

      1. ఏదీ.. మన జగన్ రెడ్డి ఇంటి ముందు ఫైర్ ఆక్సిడెంట్ అయినప్పుడు.. అనుమానాలు వచ్చినట్టా..

        అంతేలే.. మీ బండారం మీరే బయట పెట్టుకుంటూ ఉంటారు..

    1. 13 years ga bail meeda vunnadu ante artham chesukooondi sir cases entha strong ani and profs entha strong ani, also why can’t CBN sir and Sonia ji can work against Jagan sir and send him to jail!!!!

      1. మీ అమోఘమైన తెలివికి జోహార్లు..

        బెయిల్ మీద ఉంటె కేసులు వీక్ గా ఉన్నట్టా.. అద్భుతం..

        మీ వైసీపీ గాళ్ళకే ఉంటాయి ఇలాంటి కోడిబుర్రలు..

  5. జరిగింది బ్లాక్ 2 లో ఫైర్ ఆక్సిడెంట్ – అందులో పవన్ కళ్యాణ్ పేషీ లేదు … నువ్వు ఎర్రిహుక్ రాతలు …సిగ్గూశరం ఎలానూ లేవు నీకు – కనీసం ఏం రాస్తున్నామో కూడా చూసుకోవా

Comments are closed.