ప్రియురాలి చెప్పులు మోసిన స్టార్ హీరో!

ఇటీవ‌ల ప్రేయ‌సి సింగ‌ర్ స‌బా అజాద్ తో క‌లిసి నీతా అంబానీ క‌ల్చ‌ల‌ర్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ త‌న సింప్లిసిటీని చాటుకున్నారు.  ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అమిత్ అగ‌ర్వాల్…

ఇటీవ‌ల ప్రేయ‌సి సింగ‌ర్ స‌బా అజాద్ తో క‌లిసి నీతా అంబానీ క‌ల్చ‌ల‌ర్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ త‌న సింప్లిసిటీని చాటుకున్నారు.  ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అమిత్ అగ‌ర్వాల్ తో స‌బా ఫోటో దిగుతుండ‌గా, ఆ వెనుక హృతిక్ ప్రియురాలి చెప్పుల‌ను చేతిలో ప‌ట్టుకుని క‌నిపించారు. 

ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ అవుతుండగా.. అంత పెద్ద స్టార్ హీరో ఆమె చెప్పులను ఎంత సింపుల్‌గా పట్టుకున్నాడో చూడండి అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరికొందరు “అతను ఉత్తమ ప్రియుడు, అబ్బాయిలు దయచేసి గమనించండి.” అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా హృతిక్‌ రోషన్‌ గతంలో ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ సుజానే ఖాన్‌ను 2000లో పెళ్లి చేసుకున్నాడు. కాగా వీరిద్ధరి మధ్య మనస్పర్థలు రావడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. వీరికిద్దరు పిల్లలు.  విడాకులు త‌ర్వాత ఆ మధ్య కంగనా రనౌత్ తో కాస్త స్నేహంగా మెలిగినా, ఆ తరువాత ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. త‌ర్వాత‌ స‌బాతో హృతిక్ స‌న్నిహితంగా ఉంటున్నారు.