సినిమా మీద నమ్మకం వుంటేనే హీరోలు బిజినెస్ లో చేయి పెడతారు. హీరో సుధీర్ బాబు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. తను నటిస్తున్న హంట్ సినిమా ఓవర్ సీస్ హక్కులను తీసుకున్నారు. ఆ సినిమా ఓవర్ సీస్ హక్కులను సుధీర్ బాబు తీసుకుని, పంపిణీ బాధ్యలతను ఓ సంస్థకు అప్పగించారు.
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'హంట్' సినిమాపై సుధీర్ బాబు కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా జనవరి 26న విడుదల అవుతోంది.
ఓ మలయాళం సినిమా ఆధారంగా తయారవుతున్న 'హంట్'లో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. తోటి ఐపీఎస్ ఆఫీసర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉండగా… గతం మర్చిపోతారు. వ్యక్తులు, సంఘటనలు ఏవీ గుర్తు ఉండవు. కానీ, పోలీస్ ట్రైనింగ్ స్టామినా గుర్తు ఉంటాయి. హీరో గతం మర్చిపోవడానికి కారణం ఏమిటి? చివరకు ఆ కేసును ఎలా సాల్వ్ చేశాడు? అనేది కథ.
రెగ్యులర్ కాప్ డ్రామాగా కాకుండా కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ యాక్షన్ తో రూపొందిన సినిమా ఇది. స్టంట్ సీక్వెన్సుల కోసం హాలీవుడ్ నుంచి 'జాన్ విక్ 4'కు వర్క్ చేస్తున్న యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ను తీసుకొచ్చారు. భవ్య క్రియేషన్స్ వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ కీ రోల్స్ చేశారు.