శ్రావణి ఆత్మహత్య కేసు: అందరూ నిందితులే

శ్రావణి ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అందర్నీ నిందితులుగా తేల్చారు పోలీసులు. కొంతమంది మానసికంగా, కొంతమంది శారీరంగా హింసించడంతో శ్రావణి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం..…

శ్రావణి ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అందర్నీ నిందితులుగా తేల్చారు పోలీసులు. కొంతమంది మానసికంగా, కొంతమంది శారీరంగా హింసించడంతో శ్రావణి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం..

టీవీ సీరియల్ నటి శ్రావణికి 2015లో పరిచయమయ్యాడు సాయి. అప్పట్నుంచి వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉంటున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అశోక్ రెడ్డి అనే పరిచయమయ్యాడు. తను తీసిన ఓ సినిమాలో శ్రావణికి ఓ క్యారెక్టర్ కూడా ఇచ్చాడు. అప్పట్నుంచి అశోక్ రెడ్డితో కూడా శ్రావణికి సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత రెండేళ్లకు దేవరాజ్ పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు దేవరాజ్ తో ప్రేమలో పడింది శ్రావణి.

దేవరాజ్-శ్రావణి క్లోజ్ గా ఉండడం సాయికి నచ్చలేదు. ఈ విషయంపై సాయి-శ్రావణి మధ్య ఎప్పటికప్పుడు గొడవలు జరిగాయి. మరోవైపు శ్రావణి తల్లిదండ్రులు, అశోక్ రెడ్డి కూడా దేవరాజ్ కు దూరంగా ఉండమని శ్రావణిపై ఒత్తిడి తీసుకొచ్చారు. మానసికంగా హింసించారు.

సరిగ్గా అదే టైమ్ లో శ్రావణిని పెళ్లి చేసుకోవడానికి దేవరాజ్ నిరాకరించాడు. అశోక్ రెడ్డి, సాయితో ఉన్న సంబంధాలు చూసి దేవరాజ్ ఈ పెళ్లికి నిరాకరించాడు. అప్పట్నుంచి శ్రావణి మనస్తాపానికి గురైంది. ఆత్మహత్యకు ముందు కూడా దేవరాజ్ తో శ్రావణి మాట్లాడగా.. పెళ్లి చేసుకోనని దేవరాజ్ చెప్పడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. అదే సంభాషణలో దేవరాజ్ తో తనను సాయి, అశోక్ రెడ్డి శారీరకంగా హింసించారని శ్రావణి చెప్పింది. ఆ కాల్ తర్వాత శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.

ఈ కేసులో అందర్నీ నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. సాయిని ఏ-1గా.. అశోక్ రెడ్డిని ఏ-2గా.. దేవరాజ్ ను ఏ-3 నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ పైల్ చేశారు. ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్న సాయి, దేవరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులది కూడా తప్పు ఉన్నప్పటికీ వాళ్లను నిందితుల లిస్ట్ లో చేర్చడం లేదన్నారు పోలీసులు. కూతురిపై ప్రేమతోనే వాళ్లు ఒత్తిడి చేశారని చెబుతున్నారు.

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు