ఒకప్పుడు సింగిల్ అని చెప్పుకునే వారు. డేటింగ్ లో ఉన్నప్పటికీ పైకి చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రేమలో ఉన్నామని చెప్పుకోవడానికి హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. తాము ఎంతమాత్రం సింగిల్ కాదని, ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నామని ప్రకటించుకోవడం ఇప్పుడు తాజా ట్రెండ్ గా మారినట్టుంది.
మొన్నటికిమొన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బాంబ్ పేల్చింది. చూడ్డానికి క్యూట్ గా, అమాయకంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తను ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. సింగిల్ కాదని స్పష్టం చేసింది. అయితే తనది ప్రస్తుతానికి వన్ సైడ్ లవ్ మాత్రమేనని అంటోంది. అటువైపు నుంచి సిగ్నల్ కోసం వెయిటింగ్ అంట. తను ప్రేమించి పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పేసిందట అనుపమ.
సోషల్ మీడియాలో సంచలనాకు మారుపేరుగా నిలిచిన మీరా చోప్రా కూడా తన పెళ్లిపై స్పందించింది. తను కూడా సింగిల్ కాదని ప్రకటించింది. అంతేకాదు, ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పి, అందరికీ షాక్ ఇచ్చింది. అతగాడు ఎవరనే విషయాన్ని మాత్రం చోప్రా బయటపెట్టలేదు.
ఇదే లిస్ట్ లో మరికొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు. కృతి సనన్ ఆల్రెడీ ఈ దిశగా ప్రకటన చేసింది. తను సింగిల్ కాదని, అంతకుమించి అడగొద్దని చెప్పుకొచ్చంది. ఇక పాయల్ అయితే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తోనే షూటింగ్స్ కు హాజరవుతుంది.
మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తను ప్రేమలో ఉన్నానా లేదా అనే విషయం తనకే తెలియడం లేదని, మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చింది. తను ఒకరికి బాగా దగ్గరయ్యాననే విషయాన్ని మాత్రం పరోక్షంగా చెప్పేసింది.
ఇలా చాలామంది హీరోయిన్లు తాము సింగిల్ కాదని ప్రకటించుకుంటున్నారు. ఒకప్పుడు సింగిల్ గా ఉన్నామని చెప్పుకోవడం గొప్ప విషయం, ఇప్పుడు మింగిల్ అయ్యామని చెప్పుకోవడం ఫ్యాషన్.