హీరో కనిపిస్తే అమ్మాయిలకు చాలా ఆనందం. దాదాపు హీరోలందరికీ ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే సాయిధరమ్ తేజ్ కూడా అమ్మాయిల ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే తనకు మాత్రం అమ్మాయిలంటే అంతగా పడదంటున్నాడు ఈ హీరో. దీనికి ఓ కారణం కూడా చెబుతున్నాడు.
సినిమాల్లోకి రాకముందు నుంచే అమ్మాయిలంటే తనకు కాస్త చిరాకు ఉందని ప్రకటించుకున్నాడు సాయితేజ్. స్కూల్ డేస్ లోనే తనకు ఆ అభిప్రాయం వచ్చేసిందని, దానికి కారణం తనకు పాఠాలు చెప్పిన టీచర్ అని కూడా చెప్పాడు.
“స్కూల్, కాలేజ్ డేస్ లో నేను కాస్త అల్లరి చేసేవాడ్ని. అమ్మాయిలకు టీచర్ పనిష్మెంట్ ఇస్తే వెనుక నుంచి గట్టిగా అరిచేవాడ్ని. అప్పుడు నాకు టీచర్ ఇచ్చే పనిష్మెంట్ ను నేను ఇప్పటికీ మరిచిపోలేను. నేను అల్లరి చేసిన ప్రతిసారి నన్ను తీసుకెళ్లి, అమ్మాయిల మధ్య కూర్చోబెట్టేవారు. దాంతో సైలెంట్ అయిపోయేవాడ్ని. అందుకే అమ్మాయిలంటే చిరాకు వచ్చేసింది. అలాంటి పనిష్మెంట్ ఎవ్వరికీ రాకూడదు. అమ్మాయిల మధ్య కూర్చోవడం చాలా కష్టం.”
ఇలా అమ్మాయిలంటే తనకు ఎందుకు చిరాకో బయటపెట్టాడు సాయితేజ్. బేసిగ్గా తను అల్లరి బాగా చేస్తానని, తన గ్యాంగ్ లో ప్రతి ఒక్కరు బాగా గోల చేస్తారని, తను మాత్రం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యానని అంటున్నాడు సాయితేజ్. తనకు బాగా మొహమాటం ఉందనే విషయం, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తెలిసిందంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
విరూపాక్ష మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇలా తన లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని బయటపెడుతున్నాడు సాయితేజ్. మొన్నటికిమొన్న లవ్ ఎఫైర్లపై స్పందించిన ఈ హీరో, ఇప్పుడు తన స్కూల్-కాలేజ్ డేస్ ను గుర్తు చేసుకున్నాడు. ఓవైపు ఇలాంటి రొమాంటిక్ ఎలిమెంట్స్ ను షేర్ చేస్తూనే, మరోవైపు అందరూ హెల్మెట్ ధరించి రోడ్లపైకి రావాలని సందేశం ఇస్తున్నాడు. చేతిలో హెల్మెట్ పట్టుకొని మరీ కెమెరాలకు పోజులిస్తున్నాడు.