అప్పుడు నాగచైతన్య.. ఇప్పుడు వరుణ్ తేజ్

ఓ సినిమా రిలీజ్ కు ముందే ఫ్లాప్ అవుతుందని కొందరికి తెలిసిపోతుంది. కాకపోతే ఆ విషయాన్ని బయటకు చెప్పరు. సినిమా విడుదల తర్వాత కూడా మౌనం వహిస్తారు. కానీ ఈమధ్య హీరోలు మారారు. తాము…

ఓ సినిమా రిలీజ్ కు ముందే ఫ్లాప్ అవుతుందని కొందరికి తెలిసిపోతుంది. కాకపోతే ఆ విషయాన్ని బయటకు చెప్పరు. సినిమా విడుదల తర్వాత కూడా మౌనం వహిస్తారు. కానీ ఈమధ్య హీరోలు మారారు. తాము నటించిన ఓ సినిమా బాగా లేకపోతే, అది ఫెయిల్ అయిందని రిలీజ్ తర్వాత అంగీకరిస్తున్నారు.

ఆమధ్య విజయ్ దేవరకొండ ఇలాంటి ప్రకటనే చేశాడు. తను నటించిన ఓ సినిమాకు సంబంధించి ఫ్లాప్ అని అంగీకరించాడు. రీసెంట్ గా నాగచైతన్య కూడా తను నటించిన థ్యాంక్ యూ సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం తనకు ముందే తెలుసని ప్రకటించాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి వరుణ్ తేజ్ కూడా చేరాడు.

ఆమధ్య గని అనే సినిమా చేశాడు వరుణ్ తేజ్. అది డిజాస్టర్ అయింది. ఎంతలా అంటే, బహిరంగంగా లేఖ విడుదల చేసి మరీ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాడు. తాజాగా ఈ సినిమాపై స్పందించాడు వరుణ్ తేజ్. గని సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం తనకు రిలీజ్ కు ముందే తెలుసంటున్నాడు.

బేసిక్ గా గని సినిమా స్పోర్ట్స్ జానర్ మూవీ. దాన్ని అదే జానర్ లో తీస్తే బాగుండేది. కానీ అందులో అన్ని జానర్లు కలిపారు. స్పోర్ట్స్ తో పాటు లవ్, ఫ్యామిలీ, కామెడీ.. ఇలా చాలా మిక్స్ చేసే ప్రయత్నం చేశారు. అదే గని సినిమాను దెబ్బకొట్టిందని అభిప్రాయపడ్డాడు వరుణ్ తేజ్.

మిస్టర్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తను ఎన్ని పాఠాలు నేర్చుకున్నానో, గని సినిమా ఫెయిలైన తర్వాత కూడా అన్నే పాఠాలు నేర్చుకున్నానని ప్రకటించాడు.

అంతా బాగానే ఉంది కానీ గని సినిమాకు అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబి నిర్మాత. ఈ సినిమాపై విడుదలకు ముందు అల్లు బాబి చాలా అంచనాలు పెట్టుకున్నాడు. బాహుబలి రేంజ్ లో హిట్ కొడతామన్నట్టు మాట్లాడాడు. కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం తనకు విడుదలకు ముందే తెలుసంటూ వరుణ్ తేజ్ ఇప్పుడు అంటున్నాడు. దీనిపై బాబి రియాక్షన్ ఏంటో!