‘అంటే సుందరానికి’ సినిమా రిలీజైన టైమ్ లో నానిపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఆ సినిమా తర్వాత నాని నుంచి మరికొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఇంకా ‘అంటే సుందరానికి’ సినిమా గురించి జనం, మీడియా మాట్లాడుతున్నారంటే.. ఆ సినిమా ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఫ్లాప్ అయిన ఆ సినిమాను ఎన్నోసార్లు వెనకేసుకొచ్చాడు నాని. ఇప్పుడు కూడా అదే పనిచేశాడు. అయితే ఈసారి మాత్రం ఓ కొత్త విషయం బయటపెట్టాడు.
“గతంలో నేను చిన్నపాటి కామెడీ చేసిన ప్రతి సినిమా హిట్టయింది. అంటే సుందరానికి సినిమా విషయంలో ఆ కామెడీని మరింత ఆశించారు. కానీ అందులో డ్రామా, ఫ్యామిలీ, కన్ఫ్యూజన్.. ఇలా చాలా ఉన్నాయి. దీంతో కామెడీ వెనక్కు వెళ్లిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆ సినిమాకు నేను రాంగ్ ఛాయిస్. ఆ సినిమాకు స్టార్ అవసరం లేదు. స్టార్ డమ్ లేని మరో నటుడు ఆ పాత్ర చేసినట్టయితే సినిమాకు మంచి ప్రశంసలు దక్కి ఉండేవి.”
ఆల్రెడీ ఓ ఇమేజ్ ఉన్న తనలాంటి నటుడు ‘అంటే సుందరానికి’ సినిమా చేయడమే పెద్ద తప్పని అన్నాడు నాని. ప్రేక్షకులు తన నుంచి మంచి ఎలివేషన్లు, కామెడీ ఆశించారని..అది దొరక్కపోగా.. సినిమాలో ఎక్కువ భాగం హీరోహీరోయిన్లు మాత్రమే కనిపించడంతో జనం బోర్ ఫీల్ అయ్యారని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే.. థియేటర్లలో ఫెయిలైన ఆ సినిమాను టీవీ ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఆ సినిమా రేటింగ్స్ లో కనిపించదు.
Call boy works 8341510897
హీరో హీరోయిన్ లు కనపడడం కంటే వాళ్లిద్దరి చిన్నపటి characters వేసిన వాళ్ళు ఎక్కువ సేపు ఉండడం వల్ల అలా అయిందేమో.. మంచి హీరో హీరోయిన్స్ ను పెట్టుకుని వాళ్ళ మీద కథ నడపాలి..
స్టార్ డం లేని నటుడైతే సినిమా నడిచేది, నేనున్నందుకు నడవలేదు…
అంటే నాని తనను తాను స్టార్ అని ప్రకటించుకున్నాడా?
ప్రేక్షకులు ఎదో గాలివాటంగా దసరాను జాలిపడో, కథ బాగుందనో హిట్ చేసారు. దానికే నాని స్టార్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాడు
నాని స్టార్ ఎప్పుడయ్యాడు?
అంటే సుందరానికి మంచి సినిమా ….కధను అర్ధం చేసుకునే గొప్ప మనసు వుండాలి.. Vivek Athreya’ done a good job..
జనం పట్టించుకోరు
నాని స్టార్ హీరో మాత్రం కాదు తను 2 టైర్ కేటగిరీ హీరో మాత్రమే