హీరోయిన్ల ఎంపికలో హను రాఘవపూడి తనదైన శైలి చూపిస్తాడు. అతడి హీరోయిన్ ఎంపిక ఎప్పుడూ మిస్ ఫైర్ అవ్వలేదు. అలాంటి ఓ దర్శకుడు, ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయిని ఎంపిక చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది.
ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి అనే అమ్మాయిని తీసుకున్నాడు హను రాఘవపూడి. అయితే ఈసారి నిర్ణయం తను మాత్రమే తీసుకోలేదని అన్నాడు. సోషల్ మీడియాలో ఆమె వీడియోస్ చూసి, నిర్మాతలు, హీరోకు చూపించాడట హను.
ఆ తర్వాత ఆమెకు కాల్ చేసి విషయం చెప్పాడట. అక్కడితో అయిపోలేదు. ఆమెను హైదరాబాద్ పిలిచి ఆడిషన్స్ చేశారట. అలా స్క్రీన్ టెస్ట్ చేసిన వీడియోస్ ప్రభాస్ చూసి, అతడు ఓకే చెప్పిన తర్వాతే సెలక్ట్ చేశామని వెల్లడించాడు. అలా ఇమాన్విని ఎంపిక చేయడానికి 15 రోజులు పట్టిందన్నాడు. ఒకవేళ ప్రభాస్ నో చెబితే, ఆప్షన్-2, ఆప్షన్-3 కూడా పెట్టుకున్నామని వెల్లడించాడు.
ఇమాన్వి మంచి డాన్సర్ కాబట్టి ఆమెను ఎంపిక చేయలేదంటున్నాడు హను. ఆమె కళ్లు మాట్లాడతాయని, ఆ అంశం తనకు బాగా నచ్చి ఎంపిక చేశానని చెప్పుకొచ్చాడు. ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి లాస్ ఏంజెల్స్ లో చదువుకుంది. కొన్నాళ్లు జాబ్ చేసి, తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో డాన్సర్ గా మారింది.
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు