ఆహా ఓటిటి సంస్థ నాలుగు నెలల పాటు బాలయ్య పండగ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. అన్ స్టాపబుల్ సీజన్ 3 ను ప్రారంభించబోతోంది. ఈసారి గెస్ట్ లిస్ట్ కాస్త అట్రాక్టివ్ గానే రెడీ అవుతోంది. ఇప్పటి వరకు లేని ఇంట్రస్టింగ్ పేర్లు కొన్ని ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. అయితే వీటిలో ఏవి ఎంత వరకు ఫైనల్ అవుతాయో తెలియదు.
ఇప్పటి వరకు అన్ స్టాపబుల్ కు రాలేదు మెగాస్టార్, నాగార్జున. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి వస్తారని టాక్ వినిపిస్తోంది. నాగార్జున పేరు అయితే ఆహా రెడీ చేసుకున్న జాబితాలో వుంది. నాగ్- బాలయ్య కలిసి చాలా కాలం అయింది. దాదాపు ఎడమొహంగానే వుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు కలుస్తారా అన్నది చూడాలి.
రజనీకాంత్- మోహన్ బాబు ఓ జంటగా ప్లాన్ చేస్తున్నారు. మోహన్ బాబు ఇప్పటికే ఓసారి అన్ స్టాపబుల్ కు వచ్చారు. అయితే ఈసారి రజనీతో కలిసి వస్తారు. ఆ ఇద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ సిఎమ్ రేవంత్ రెడ్డి పేరు కూడా గెస్ట్ లిస్ట్ లో వుంది. ఇది కూడా భలే ఇంట్రస్టింగ్ గా వుంటుంది. రేవంత్ రెడ్డి సోలోగా వస్తారా? కూడా ఎవరైనా వస్తారా? అన్నది చూడాలి.
ఇవన్నీ పక్కన పెడితే మరో సూపర్ అట్రాక్షన్ కూడా వుంది.
బాలయ్య ఇద్దరు కూతుళ్లు.. ఇద్దరు అల్లుళ్లు.. వీలైతే భార్య కూడా ఒక షో లో పాల్గొంటారు. అదే స్పెషల్ అట్రాక్షన్.
అన్నీ బాగానే వున్నాయి. కానీ అసలు సిసలు పేరు..యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మాత్రం వినిపించడం లేదు అదే గమ్మత్తు.
A vinash & Cement ని పిలిస్తే ఎలా ఉంటది??
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
జనం పట్టించుకోరు