కొద్ది వారాల గ్యాప్ లో ఇద్దరు హీరోలు ఒకే ప్రమోషన్ ఏజెన్సీ వల్ల ఎంబ్రాసింగ్ సిట్యువేషన్ ను ఎదుర్కొన్నారు. మేము ఫేమస్ సినిమా కోసం మొహమాటానికి వెళ్లి మహేష్ బాబు ట్వీట్ వేసారు. ఆయనకు ఆ సినిమా నిర్మాణ సంస్థ అయిన ప్రమోషన్ ఏజెన్సీకి మధ్య బలమైన స్నేహం వుండడంతో ఏం ట్వీట్ వేస్తున్నారో చూడకుండానే ఓకె అనేసారు.
కానీ ఆ ట్వీట్ మహేష్ ను సోషల్ మీడియాలో గట్టిగా కార్నర్ చేసింది. మరో క్రేజీ యంగ్ హీరో కూడా ఇదే సిట్యువేషన్ ను ఎదుర్కోవాల్సిందే కానీ సినిమా విడుదలయిన తరువాత చూసి ట్వీట్ వేద్దామనడంతో తప్పింది.
తరువాత రంగబలి సినిమా విషయంలో మీడియాను అనుకరిస్తూ, వాళ్లు చేయగా లేనిది, ఎత్తి చూపగా లేనిది మనం చేస్తే తప్పా? అనే ఆలోచనతో ఓ స్పూఫ్ ఇంటర్వూ చేయించారు. అది వైరల్ అయింది, జనాలు మిలియన్ల కొద్దీ చూసారు. కానీ సినిమాకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. ఓపెనింగ్ తేలేదు సరికదా, హీరో ను ఇబ్బంది పెట్టింది.
విడుదల తరువాత జరిగిన మీడియా మీట్ లో దీని మీదే హీరో ఎక్కువ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా మీద ప్రశ్నలు, సినిమా మంచి చెడ్డలు కాకుండా, దీనికే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చేసిన కమెడియన్ ఏమో, తనకేం తెలియదు, స్క్రిప్ట్, ప్రాపర్టీస్ తెచ్చి ఇచ్చి, ఎలా చేయమంటే అలా చేసాను అంటున్నారు. పోనీ ఈ స్పూఫ్ ఇంటర్వూ వల్ల సినిమా కు మాంచి ఓపెనింగ్ వచ్చి వుంటే, ఫలితం దక్కింది అనే సంతోషం మిగిలేది.
కానీ తమకు ఈ ఇంటర్వూలే నచ్చాయి అని జనం అవే చూస్తున్నారు. రంగబలి కంటెంట్ మీద ఇంటర్వూల్లో ఆసక్తి జనరేట్ చేయగలిగి వుంటే ఫలితం వేరేగా వుండేదేమో?