cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇది కదా.. పార్టీ జనాలకు కావాల్సింది

ఇది కదా.. పార్టీ జనాలకు కావాల్సింది

పార్టీ కార్యకర్తలు, నాయకులు అల్పసంతోషులు. అధినేత పేరు పెట్టి పలకరిస్తే చాలు పొంగిపోతారు. తమ పేరు తమ నాయకుడికి గుర్తుందని తెగ ఆనందపడిపోతారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రతి జిల్లాలో కనీసం పాతికమంది పేర్లు అయినా గుర్తుండేవని, ఆయన చాలా అంటే చాలా మందిని పేర్లు పెట్టి పలకరించేవారని చెప్పుకుంటారు ఇప్పటకీ.

జగన్ కూడా అన్న..అన్న అని ఆప్యాయంగానే పలకరిస్తారు కానీ సిఎమ్ అయిన తరువాత ఆయన జనాల్లోకి వచ్చింది తక్కువ. నాయకులను పలకరించింది తక్కువ. ఇలాంటి నేపథ్యంలో ఆయన రెండు రోజుల టూర్ కు తిరుపతి వెళ్లి వచ్చారు. 

తిరుపతి ఎయిర్ పోర్ట్ లో దిగుతూనే, తనకు ఎదురుపడిన, స్వాగతం చెప్పిన నాయకులు అందరినీ పేరు పెట్టి మరీ పలకరించారట జగన్. చిత్తూరు జిల్లా నాయకులు అంతా ఇది చెప్పుకుని, ఇది కదా తమకు కావాల్సింది అని అనుకుంటున్నారు. 

జగన్ సిఎమ్ అయిన తరువాత ఈ తరహాగా చూడడం ఇదే మళ్లీ అని చెఫ్పుకుంటున్నారు.

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×