ఇది మరో గ్రామీణ ‘రంగస్థలం’

గ్రామ రాజకీయాలు, కులాల కుమ్ములాటల నేపథ్యంలో రంగస్థలం సినిమా వచ్చింది. దర్శకుడు సుకుమార్ తెలివిగా కులాల పేర్లు పెట్టకపోయినా, రెండు అగ్రవర్ణాలను పరోక్షంగా ప్రస్తావించి, విలన్లుగా చూపించి, తనకు నచ్చిన కులాన్ని పాజిటివ్ గా…

గ్రామ రాజకీయాలు, కులాల కుమ్ములాటల నేపథ్యంలో రంగస్థలం సినిమా వచ్చింది. దర్శకుడు సుకుమార్ తెలివిగా కులాల పేర్లు పెట్టకపోయినా, రెండు అగ్రవర్ణాలను పరోక్షంగా ప్రస్తావించి, విలన్లుగా చూపించి, తనకు నచ్చిన కులాన్ని పాజిటివ్ గా చూపించేసి హిట్ కొట్టేసారు. ఇప్పుడు అలా చేయకుండా నేరుగా పెదకాపు అనే పేరు పెట్టి మరీ అదే గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సినిమా అందిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

ఇలాంటి జానర్ సినిమాలు తీయడం శ్రీకాంత్ అడ్డాలకు కొత్త కాదు. గతంలో కాస్త లైట్ గా ముకుంద సినిమా తీసారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది కనుక, మరి కాస్త ఇంటెన్సివ్ గా పెదకాపు అంటూ సినిమా చూపించేయబోతున్నారు. విరాట్ కర్ణ అనే కొత్త హీరో ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. గతంలో జయ జానకీ నాయక, అఖండ లాంటి సినిమాలు అందించిన నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి బంధవే ఈ హీరో.

టీజర్ మొత్తం గ్రామీణ రాజకీయాలను బలంగా చూపే ప్రయత్నం చేసింది. తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్త రోజుల నేపథ్యంలో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య వర్తమాన రాజకీయాల మీద సినిమాలు తీయడం లేదు. ఎందుకొచ్చిన తలకాయనొప్పి అని. పీరియాడిక్ ఫిల్మ్ గా మార్చేస్తే బెటర్ అనుకుంటున్నారేమో? పెదకాపులో ఏం చేసారో తెలియదు కానీ స్టార్ట్ చేయడం మాత్రం ఎనభయ్యవ దశకంలో మొదలుపెట్టారు.

రావు రమేష్, నాగబాబు లాంటి బలమైన సపోర్టింగ్ నటులు వున్నారు. మిక్కీ జే మేయర్ లాంటి టెక్నీషియన్ల సపోర్ట్ వుంది.