ఇదే రిపీట్ అయితే థియేటర్ల పరిస్థితేంటి..?

తెలిసో తెలియకో చాలామందికి పుష్ప-2 మేకర్స్ ఓ దారి చూపించారు. సినిమా ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. వంద కోట్లు వడ్డీ కట్టినా టెన్షన్ లేదు. బడ్జెట్ చేయి దాటిపోయి, హిమాలయాల పైకి ఎక్కి కూర్చున్నా…

తెలిసో తెలియకో చాలామందికి పుష్ప-2 మేకర్స్ ఓ దారి చూపించారు. సినిమా ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. వంద కోట్లు వడ్డీ కట్టినా టెన్షన్ లేదు. బడ్జెట్ చేయి దాటిపోయి, హిమాలయాల పైకి ఎక్కి కూర్చున్నా ఫరక్ పడదు. హీరో వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నా చల్తా..

ఎందుకంటే, సరిగ్గా విడుదలకు ముందు ప్రభుత్వంలో తెలిసిన పెద్దల్ని కలిశామా.. కిందామీద పడి జీవో తెచ్చుకున్నామా లేదా.. ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారింది. ఇదొక్కటి చేస్తే చాలు, అందినకాడికి దండుకోవచ్చు. హీరో క్రేజ్ ను థియేటర్లలో కాసుల రూపంలో దొరికినకాడికి పిండుకోవచ్చు.

ఇది యాపారం.. ఎవ్వరూ కాదనలేరు. మరి థియేట్రికల్ సిస్టమ్ సంగతేంటి? ఇప్పటికే జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు, మరికొంతమంది ప్రేక్షకులు పూర్తిగా మానుకున్నారు కూడా, ఓటీటీకి జై కొడుకున్నారు. ఇలాంటి టైమ్ లో స్టార్ హీరో సినిమాకు కామన్ ఆడియన్స్ ను థియేటర్ల వైపు ఆకర్షించేలా ప్రణాళికలు ఉండాలి కానీ, ఇలా భారీగా రేట్లు పెంచేసుకుంటే ఎలా?

ఇదే జరిగితే రాబోయే కాలంలో ఎంత పెద్ద హీరో సినిమానైనా థియేటర్లలో ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. మిగతావాళ్లంతా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తారు. ఇప్పటికే ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఫీలింగ్ వచ్చేసింది. పుష్ప-2 టైపులో మరో 3 సినిమాలు వస్తే ఇండస్ట్రీకి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. తమనుతాము ‘మధ్య తరగతి’గా ఫీలయ్యే బన్నీ లాంటి హీరోలైనా ఈ దిశగా ఆలోచిస్తే మంచిదేమో!

17 Replies to “ఇదే రిపీట్ అయితే థియేటర్ల పరిస్థితేంటి..?”

  1. మా అన్నయ్య అభిమానులకు ఆనందమే టికెట్ రేట్లు పెంచడం (గతంలో టికెట్ ధరలు తగ్గించడాన్ని సపోర్ట్ చేశారు)

  2. Hero is poor guy and director also poor.in just loot people antey for this support by our grater kings.if common people or poor people ask something nothing will come

  3. ఇప్పటికే జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు, మరికొంతమంది ప్రేక్షకులు పూర్తిగా మానుకున్నారు కూడా, ఓటీటీకి జై కొడుకున్నారు.

    రాబోయే కాలంలో ఎంత పెద్ద హీరో సినిమానైనా థియేటర్లలో ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. మిగతావాళ్లంతా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తారు. ఇప్పటికే ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఫీలింగ్ వచ్చేసింది.

Comments are closed.