బన్నీ చెప్పింది ప్రేక్షకులు పాటిస్తే.. అంతే సంగతి!

“నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి, బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు. నాకు వంద కోట్లు ఉన్నాయని, 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ను వంద రూపాయలు పెట్టి కొనను. దాని విలువ 10…

“నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి, బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు. నాకు వంద కోట్లు ఉన్నాయని, 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ను వంద రూపాయలు పెట్టి కొనను. దాని విలువ 10 రూపాయలే, దానికి అంతే ఇస్తా. నా దగ్గర వెయ్యి కోట్లు ఉన్నా దేనికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇస్తా. నా దగ్గర ఎంతుంది అనే కంటే, ఆ ప్రాడెక్ట్ కు ఎంత విలువ ఉందనేది చూస్తాను.”

పుష్ప-2 టికెట్ రేట్లు భారీగా పెంచడానికి జస్ట్ కొన్ని రోజుల ముందు అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఇప్పుడీ స్టేట్ మెంట్ ను సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు జనం. వంద కోట్లు ఆస్తి ఉన్న అల్లు అర్జున్, అంత జాగ్రత్తగా ఉంటున్నప్పుడు.. మధ్యతరగతికి చెందిన తాము ఎందుకు టికెట్ కు వెయ్యి రూపాయలు పెట్టాలని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా మిడిల్-క్లాస్ అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు కొంతమంది. ఈ స్టేట్ మెంట్ కూడా అల్లు అర్జున్ ఇచ్చిందే.

“నేను మంచి డబ్బున్న కుటుంబంలో పుట్టినప్పటికీ నాన్న, తాతయ్య మిడిల్-క్లాస్ లో పుట్టడం వల్ల, బాగా డబ్బులు సంపాదించినప్పటికీ ఆ మిడిల్-క్లాస్ అలవాట్లు నుంచి బయటకు రాలేదు. కాబట్టి నేను కూడా అదే మనస్తత్వంలో పుట్టి పెరిగాను. నాది వెరీ మిడిల్-క్లాస్ మెంటాలిటీ.”

ఇదే మిడిల్-క్లాస్ మెంటాలటీతో ఆలోచిస్తే ఎవరైనా పుష్ప-2 రిలీజైన మొదటి 4 రోజులు థియేటర్ల వైపు వెళ్తారా? ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. కానీ పుష్ప-2 కోసం పెంచిన రేట్లు మాత్రం రచ్చ రచ్చస్య రచ్చోభ్యహః.

ఇదే రిపీట్ అయితే థియేటర్ల పరిస్థితేంటి..?

తెలిసో తెలియకో చాలామందికి పుష్ప-2 మేకర్స్ ఓ దారి చూపించారు. సినిమా ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. వంద కోట్లు వడ్డీ కట్టినా టెన్షన్ లేదు. బడ్జెట్ చేయి దాటిపోయి, హిమాలయాల పైకి ఎక్కి కూర్చున్నా ఫరక్ పడదు. హీరో వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నా చల్తా..

ఎందుకంటే, సరిగ్గా విడుదలకు ముందు ప్రభుత్వంలో తెలిసిన పెద్దల్ని కలిశామా.. కిందామీద పడి జీవో తెచ్చుకున్నామా లేదా.. ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారింది. ఇదొక్కటి చేస్తే చాలు, అందినకాడికి దండుకోవచ్చు. హీరో క్రేజ్ ను థియేటర్లలో కాసుల రూపంలో దొరికినకాడికి పిండుకోవచ్చు.

ఇది యాపారం.. ఎవ్వరూ కాదనలేరు. మరి థియేట్రికల్ సిస్టమ్ సంగతేంటి? ఇప్పటికే జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు, మరికొంతమంది ప్రేక్షకులు పూర్తిగా మానుకున్నారు కూడా, ఓటీటీకి జై కొడుకున్నారు. ఇలాంటి టైమ్ లో స్టార్ హీరో సినిమాకు కామన్ ఆడియన్స్ ను థియేటర్ల వైపు ఆకర్షించేలా ప్రణాళికలు ఉండాలి కానీ, ఇలా భారీగా రేట్లు పెంచేసుకుంటే ఎలా?

ఇదే జరిగితే రాబోయే కాలంలో ఎంత పెద్ద హీరో సినిమానైనా థియేటర్లలో ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. మిగతావాళ్లంతా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తారు. ఇప్పటికే ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఫీలింగ్ వచ్చేసింది. పుష్ప-2 టైపులో మరో 3 సినిమాలు వస్తే ఇండస్ట్రీకి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. తమనుతాము ‘మధ్య తరగతి’గా ఫీలయ్యే బన్నీ లాంటి హీరోలైనా ఈ దిశగా ఆలోచిస్తే మంచిదేమో!

18 Replies to “బన్నీ చెప్పింది ప్రేక్షకులు పాటిస్తే.. అంతే సంగతి!”

  1. థియేటర్ experiemce కి ఏదీ సాటి రాదు.జనాల కోలాహలం,ఈలలు,చప్పట్లు…డబ్బులు పోయినా ఆ కిక్కే వేరు:)

    1. అలా అని 100 – 150 రూపాయల టికెట్ ను 500-100 పెట్టి అమ్మిన పర్వాలేదు అంటారా????? అంటే మనం 10 రూపాయల బిస్క్యూయిట్ ప్యాకెట్ ను అభిమానులు అనే ముసుగులో 500 కు అమ్మిన గొర్రెల్లా బలి కావల్సిందే అంటారా మాస్టారు

  2. పాపం GA ఇది….ఒక పక్క మన payment kukkalu SM లో అల్లు బాబు కోసం రక్తం చిందుస్తుంటే….నువ్వేమో ఇక్కడ కడుపు మంట చూపిస్తున్నావ్…..😂😂

  3. ఇప్పటికే జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు, మరికొంతమంది ప్రేక్షకులు పూర్తిగా మానుకున్నారు కూడా, ఓటీటీకి జై కొడుకున్నారు.

    రాబోయే కాలంలో ఎంత పెద్ద హీరో సినిమానైనా థియేటర్లలో ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. మిగతావాళ్లంతా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తారు. ఇప్పటికే ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఫీలింగ్ వచ్చేసింది.

Comments are closed.