ఒకప్పుడు శృంగార దేవతగా అలరించిన మల్లికా షెరావత్, ఆ తర్వాత ఎందుకు పెద్దగా సినిమాల్లో రాణించలేకపోయింది. మర్డర్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అందగత్తెను బాలీవుడ్ ఎందుకు ఎంకరేజ్ చేయలేదు. ఈ ప్రశ్నలకు మల్లికా షెరావత్ స్పందించింది.
“ఆ టైమ్ లో బాలీవుడ్ లో నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. అది నిజం. నాకు బాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేదు. కనీసం నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటే నాకు సినిమా ఆఫర్లు వచ్చి ఉండేవి. అయినప్పటికీ నేను బాధపడలేదు. నాకొచ్చిన సినిమాలు నేను చేశాను. నా లైఫ్ ను నేను ఎంజాయ్ చేశాను.”
ఇలా బాలీవుడ్ లో బాయ్ ఫ్రెండ్స్ అవసరాన్ని పరోక్షంగా నొక్కిచెప్పింది మల్లికా షెరావత్. ఇండస్ట్రీలోకొచ్చిన ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాలని, అతడే ఆమెకు అవకాశాలు తెచ్చి పెడతాడని పరోక్షంగా చెప్పుకొచ్చిన మల్లికా.. తనకు అప్పట్లో అలాంటి బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పింది.
మర్డర్ లో చేసిన ఎరోటిక్ సన్నివేశాలు చూసిన తర్వాత తనతో డేటింగ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదని, అయినప్పటికీ తను అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదని అంటోంది మల్లికా. మర్డర్ లో తను చేసిన సన్నివేశాలు అప్పట్లో సంచలనం సృష్టించినప్పటికీ, ఇప్పుడొస్తున్న సినిమాల్లో అలాంటి సీన్లు కామన్ అయిపోయాయని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో బాలీవుడ్ బాగా డెవలప్ అయిందంటోంది.
మల్లికా షెరావత్ చెప్పిన మేటర్ లో చాలా నిజం ఉంది. బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే. ఐశ్వర్యరాయ్ నుంచి దీపిక పదుకోన్ వరకు చాలామంది హీరోయిన్లకు కెరీర్ ప్రారంభంలో అవకాశాలు ఇలానే వచ్చాయి. ఈ జనరేషన్ హీరోలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇండస్ట్రీలోకి ఇలా రావడం ఆలస్యం, అలా ఓ మంచి పార్టనర్ ను సెలక్ట్ చేసుకుంటున్నారు.