ఇక ఆ ఇద్దరికీ థమన్ దూరమేనా?

సక్సెస్..సక్సెస్..థమన్..టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్టర్. టాప్ హీరోలు అంతా అతని వెంటే. మిడ్ రేంజ్ హీరోల మినిమమ్ డిమాండ్ కూడా అదే. కానీ డైరక్టర్ శివ నిర్వాణకు థమన్ అక్కరలేదు.  Advertisement అలాగే…

సక్సెస్..సక్సెస్..థమన్..టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్టర్. టాప్ హీరోలు అంతా అతని వెంటే. మిడ్ రేంజ్ హీరోల మినిమమ్ డిమాండ్ కూడా అదే. కానీ డైరక్టర్ శివ నిర్వాణకు థమన్ అక్కరలేదు. 

అలాగే హీరో నానికి కూడా అవసరం లేదు? ఏమిటి రీజ‌న్. దీని వెనుక టక్ జ‌గదీష్ నాటి వైరం వుందన్నది గ్యాసిప్. టక్ జ‌గదీష్ టైమ్ లో ఆ సినిమాకు థమన్ తో పాటు గోపీసుందర్ కూడా పని చేసిన వైనం గుర్తుండే వుంటుంది.

దాని వెనుక రీజ‌న్ నే ఒక చిన్న వివాదం. థమన్ కు శివనిర్వాణ కు మధ్య చిన్న వివాదం. అది చినికి చినికి గాలివానగా మారిందని బోగట్టా. దాంతో ఇప్పుడు ఆ ఇద్దరికీ థమన్ తో సంబంధాలు చెడ్డాయని బోగట్టా. అందుకే నాని సినిమాలకు ఎవెరెవర్నో వెదికి తెస్తున్నారు. అలాగే శివనిర్వాణ ఎవరెవర్నో వెదికి పట్టుకుంటున్నారు.

మరి ఇంతలా దూరం చేసిన ఆ వివాదం వివరాలు ఏమిటో ఆ ముగ్గురికే తెలియాలి. గతంలో ఇలాంటి చిన్న ఇగో ప్రాబ్లమ్ రావడం వల్లనే దేవీశ్రీ ప్రసాద్ డైరక్టర్ త్రివిక్రమ్ కు దూరం అయ్యారని వార్తలు వున్నాయి. సినిమా రంగంలో వర్క్ కాదు, డైరక్టర్లకు టెక్నీషియన్లు ఇచ్చే రెస్సాన్స్ బట్టి బంధాలు నిలబడతాయి.