1).అనిల్‌తో విభేదాలు లేవుః కాకాణి -అవును వాళ్లిద్దరూ కలిసిపోయారు, మనం నమ్మాలి
2). బీజేపీ అంటే బుల్‌డోజర్ జనతా పార్టీ
3). సినిమా వాళ్ల రొటీన్ డైలాగ్ – నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇది
4). వంద మందితో సూసైడ్ బ్యాచ్ -బుద్దా వెంకన్న -మిగిలిన 99 పేర్లు చెప్పండి
5). త్వరలో కాంగ్రెస్ పాదయాత్ర -శైలజానాథ్ -పాదాలు అరిగిపోయినా చేతిని నమ్మారు
6). పార్టీ యంత్రాంగంలో సమూల మార్పులు అవసరం- కాంగ్రెస్‌కి పికె సలహా -మార్పులు కాదు, కొత్త యంత్రాన్ని అమర్చాలి
7). చంద్రబాబే నా సూపర్‌స్టార్ – లోకేశ్ -ఆయన సూపర్‌స్టార్ మీరు -సరిపోయింది భజన
8). నాకు జీతం వద్దు -ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి -గట్టిగా అనకండి, జనం వేరే అర్థం చేసుకుంటారు
9). నెల్లూరు సామెత- వడియాల కోసం ఎండాకాలం రాదు
10). గొర్రెలకు కంబళ్లు ఉచితంగా ఇవ్వడమే రాజకీయం
-జీఆర్ మహర్షి