ఏయ్‌…ఏయ్‌…ఇలియానా ఏమా డ్రెస్‌? ఏమా క‌థ‌?

లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చానంటోంది హీరోయిన్ ఇలియానా. త‌న వ‌స్త్ర‌ధార‌ణ‌తో కుర్ర‌కారును ఏం చేయాల‌నుకుంటుందోన‌ని నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు. హీరో ర‌వితేజ‌తో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో న‌టించిన హీరోయిన్ ఇలియానా…చాలా గ్యాప్ త‌ర్వాత…

లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చానంటోంది హీరోయిన్ ఇలియానా. త‌న వ‌స్త్ర‌ధార‌ణ‌తో కుర్ర‌కారును ఏం చేయాల‌నుకుంటుందోన‌ని నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు. హీరో ర‌వితేజ‌తో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో న‌టించిన హీరోయిన్ ఇలియానా…చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ స‌రికొత్త గెట‌ప్‌తో ప్రేక్ష‌కుల ముంద‌కొస్తోంది. తాజాగా ఆమె బ్లాక్ బికినీతో యువ‌కుల మ‌తి పోగొడుతోంది.

ఇలియానా అంటే ఆల్ టైమ్ హాట్ గ‌ర్ల్‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆమె బికినీలో మ‌రింత ఆక‌ట్టుకునేలా అభిమానుల‌కు ద‌ర్శ‌న‌మిస్తోంది. తాజాగా అండమాన్, నికోబార్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన హాట్ ఫొటోలను అభిమానుల‌కు షేర్ చేసింది.  బ్లాక్ బికినీలో యువ‌త‌ను క‌వ్విస్తూ క‌నిపిస్తున్న ఆ ఫొటోలు యువ‌త మ‌న‌సుల‌ను కొల్ల‌గొడుతున్నాయి. ఈ భంగిమలో ఇలియానాను చూసిన  అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

ఇలియానా బ్లాక్ బికినీలో ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో కూడా ఇలియానా ఇలాంటి క‌వ్వించే ఫొటోలు అనేక సార్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇలియాన్ త‌న ఫిజిక్‌కు త‌గ్గ‌ట్టు వ‌స్త్ర‌ధార‌ణ చేస్తుండ‌టంతో మ‌రింత అందంగా క‌నిపిస్తోంది.  

ఇలియానా నటించిన హిందీ సినిమా ‘పాగల్‌పంతీ’ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో ఇలియానా నటనకు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇలియాన్ లేటెస్ట్ ఫొటోల‌పై నెటిజ‌న్లు స‌రదాగా ‘ఏయ్‌…ఏయ్‌…ఇలియానా ఏమా డ్రెస్‌? ఏమా క‌థ‌?’ అని కామెంట్స్ చేస్తున్నారు.