గోవా బ్యూటీ ఇలియానా గర్భవతి అనే విషయం తెలిసిందే. రేపోమాపో పండంటి బిడ్డకు ఆమె జన్మనివ్వబోతోంది. అయితే ఆ బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె ఇప్పటివరకు వెల్లడించలేదు.
దీనికి సంబంధించి దశలవారీగా తన ప్రియుడి ఫొటోల్ని మాత్రం ఆమె బయటపెడుతూ వచ్చింది. ఆమధ్య చేతిలో చేయి వేసిన ఫొటోను, ఆ తర్వాత కొన్ని రోజులకు బ్లర్ చేసిన ప్రియుడి ముఖాన్ని చూపిస్తూ పోస్టులు పెట్టింది.
ఎట్టకేలకు తన ప్రియుడు ఎవరనే విషయాన్ని ఆమె వెల్లడించింది. ఈ రోజు ఆమె ఓ వ్యక్తితో దిగిన కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. డేట్ నైట్ అంటూ లవ్ సింబల్ కూడా పెట్టింది.
దీంతో ఇలియానా ప్రియుడు ఎవరనే విషయం జనాలకు తెలిసొచ్చింది. కానీ అతడు ఎవరు? అతడు పేరేంటి? లాంటి వివరాలు మాత్రం ప్రస్తుతానికి వెల్లడికాలేదు. ఈ సందర్భంగా మరో గాసిప్ పై కూడా క్లారిటీ వచ్చింది.
కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఆమె డేటింగ్ లో ఉన్నట్టు పుకార్లు ఉన్నాయి. సో.. సెబాస్టియన్ ద్వారానే ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోందని, త్వరలోనే ఆ విషయాన్ని ఇలియానా వెల్లడిస్తుందని అంతా అనుకున్నారు.
కట్ చేస్తే, ఈరోజు ఇలియానా విడుదల చేసిన ఫొటో సెబాస్టియన్ ది కాదు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఇలియానాకు, ఇతడికి ఎక్కడ పరిచయం అయింది? త్వరలోనే ఈ వివరాలు కూడా బయటపెట్టబోతోంది గోవా బ్యూటీ.