Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇలాంటి బ్యూటీ తోడు దొరికితే ఎంత హాయో...

ఇలాంటి బ్యూటీ తోడు దొరికితే ఎంత హాయో...

ప్రేమ కావ‌చ్చు, పెళ్లి కావ‌చ్చు, ఉద్యోగం కావ‌చ్చు...ఎక్క‌డైనా చెడిందంటే అవ‌త‌లి వాళ్ల‌పై బుర‌ద చ‌ల్లేవాళ్ల‌ను చూస్తుంటాం. కానీ గోవా సుంద‌రి ఇలియానా మాత్రం అలాంటి వాటికి ప్ర‌త్యేకం. ప్రేమ విఫ‌ల కార‌ణాల‌ను తాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చెప్ప‌నంటోంది. పైపెచ్చు త‌న ప్రియుడి స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించ‌డం ఇష్టం లేద‌ని చెప్పుకొస్తోంది. త‌న ప్రేమ‌, విఫ‌ల ప్రేమ గురించి చెప్పే సంగ‌తులు వింటే...ఇలాంటి బ్యూటీ తోడు దొరికితే జీవితం ఎంత హాయిగా గ‌డిచిపోతుందో క‌దా అనే అభిప్రాయం క‌ల‌గ‌క‌మాన‌దు.

ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోస్‌తో ఇలియానా చాలా కాలంగా ప్రేమ‌లో మునిగిపోయింది. ప్రేమ‌లోని తీయ‌ద‌నాన్ని ఇద్ద‌రూ ఆస్వాదించారు. అయితే వాళ్ల‌ద్ద‌రి మ‌ధ్య ఏ విష‌యం విభేదాలు తీసుకొచ్చిందో తెలియ‌దు కానీ, విడిపోయారు. అయితే త‌న విఫ‌ల ప్రేమ, విర‌హ వేద‌న సంగ‌తుల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌డం ఇష్టం లేద‌ని ఆమె చెబుతోంది.

అయితే  నీబోన్‌ దూరమైన తర్వాత తన మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ గురించి ఆమె వివ‌రించింది.  ‘ ప్రేమలో ఉన్నప్పుడు జీవితం చాలా మధురంగా ఉంటుంది.  ఎంతో ఇష్ట‌ప‌డే నీబోన్‌ దూరమయ్యాడనే నిజాన్ని న‌మ్మ‌డానికి చాలా కష్టమైంది. అత‌ను లేని జీవితం మొత్తం చీకట్టు క‌మ్ముకున్న‌ట్టైంది. ఆ విర‌హ వేద‌న నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి చాలా సమయం పట్టింది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

ఒక వైపు త‌న విఫ‌ల ప్రేమ గురించి ఎవ‌రితోనూ పంచుకోన‌ని చెబుతూనే ...ఆమె ఒక్కొక్క‌టిగా వివ‌రిస్తూ వ‌చ్చింది. ఇంకా ఆమె ఏమేం చెప్పారో తెలుసుకుందాం.

'కార‌ణం లేకుండానే ఎవ‌రూ విడిపోరు. మా ప్రేమ విఫలం కావడానికి కూడా కార‌ణాలున్నాయి. ఆ కారణాల్ని చెప్పి  నీబోన్‌ను ఇబ్బంది పెట్ద‌ల్చుకోలేదు. అనవసర‌ విమర్శలతో అతడి స్వేచ్ఛకు భంగం కలిగించడం ఇష్టం లేదు.  ఆ రహస్యం అలా ఉండిపోవడమే ఉత్తమం. అతడిపై నాకెప్ప‌టికీ చాలా గౌరవమే ఉంటుంది. ప్రస్తుతం సింగిల్‌లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా. నన్ను నేను ప్రేమించుకుంటున్నా’ అని తెలిపింది.

ఇలియానా ప్ర‌తి మాట చాలా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఆమె మాట‌ల్లో ప‌రిణ‌తి క‌నిపిస్తోంది. ఎదుటి వారి ప‌ట్ల గౌర‌వాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఏ మ‌నిషికైనా కావాల్సింది ఇదే. 

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?