భార‌త్‌లో విద్యార్థుల కంటే గోవుల‌కే ర‌క్ష‌ణః ట్వింకిల్ ఖ‌న్నా

బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖ‌న్నా సోమ‌వారం చేసిన ఓ ట్వీట్ అదుర్స్ అనిపించింది. సామాజిక‌, రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ట్వింకిల్ ఖ‌న్నా సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తుంటారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఆదివారం రాత్రి కొంద‌రు ముష్క‌రులు…

బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖ‌న్నా సోమ‌వారం చేసిన ఓ ట్వీట్ అదుర్స్ అనిపించింది. సామాజిక‌, రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ట్వింకిల్ ఖ‌న్నా సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తుంటారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఆదివారం రాత్రి కొంద‌రు ముష్క‌రులు ముసుగులు వేసుకుని క‌ర్ర‌లు, ఇనుప క‌డ్డీల‌తో దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఆ వ‌ర్సిటీ విద్యార్థి సంఘం అధ్య‌క్షురాలు అయిషి ఘోష్ స‌హా 28 మంది విద్యార్థుల‌కు గాయాల‌య్యాయి.

జేఎన్‌యూలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు  వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ హీరోయిన్ త‌న‌వంతు సామాజిక బాధ్య‌త‌గా ట్విట‌ర్ వేదిక‌గా…. ‘భారత్… ఇక్కడ విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ‌ రక్షణ ద‌క్కుతుంది. అయితే భయపడుతూ బతకాలని ఎవరూ అనుకోవడం లేదు. మీరు హింస ద్వారా జనాలను అణచివేయలేరు. అలా చేస్తే వ్యతిరేకత పెరుగుతుంది. నిరసన ప్రదర్శనలు పెరుగుతాయి. రోడ్డుపైకి జనాలు వస్తారు’ అని మోడీ స‌ర్కార్‌పై ట్వింకిల్ ఖన్నా ఘాటుగా ఘాటుగా స్పందించారు.

ట్వింకిల్ ఖ‌న్నా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. హీరో వెంక‌టేష్ స‌ర‌స‌న ఆమె ‘శీను’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొన్నారు. హీరో అక్ష‌య్‌కుమార్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.  మోడీ-అమిత్‌షాల పేరు చెబితే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్న వ్య‌వ‌స్థ‌లో….వారిపై ఘాటైన విమ‌ర్శ‌లు చేసిన ట్వింకిల్ ఖ‌న్నా సృజ‌నాత్మ‌క కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.