V సినిమాలో మహేష్-పవన్

ఓ మల్టీస్టారర్ సినిమా వస్తుందనగానే అందులో పెద్ద హీరోల్ని ఊహించుకోవడం సహజం. ఒకప్పుడు ఎన్టీఆర్-ఏఎన్నార్, ఆ తర్వాత చిరంజీవి-బాలయ్య, మధ్యలో కృష్ణ-శోభన్ బాబు లాంటి కాంబినేషన్లను ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఊహించుకుంటుంటారు. ఇదే కోవలో ఇప్పటి…

ఓ మల్టీస్టారర్ సినిమా వస్తుందనగానే అందులో పెద్ద హీరోల్ని ఊహించుకోవడం సహజం. ఒకప్పుడు ఎన్టీఆర్-ఏఎన్నార్, ఆ తర్వాత చిరంజీవి-బాలయ్య, మధ్యలో కృష్ణ-శోభన్ బాబు లాంటి కాంబినేషన్లను ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఊహించుకుంటుంటారు. ఇదే కోవలో ఇప్పటి జనరేషన్ లో మల్టీస్టారర్ అంటే పవన్-మహేష్ కాంబినేషన్ ను ఊహించుకుంటారు ఎవరైనా.

V సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అనగానే పవన్-మహేష్ కాంబోలో అది వస్తుందని చాలామంది అనుకున్నారు. పైగా దిల్ రాజు నిర్మాత కావడంతో ప్రారంభంలో చాలా పుకార్లు వచ్చాయి. వీటిపై దర్శకుడు ఇంద్రగంటి ఏమంటున్నాడో చూద్దాం.

“మల్టీస్టారర్ అన్నప్పుడు పెద్ద హీరోల్ని ఊహించుకోవడం సహజం. కానీ నేను మాత్రం V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు. సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు
మహేష్-పవన్ కలిసి  ఈ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటుంటాం. అంతే తప్ప, వాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశానని, వాళ్లకు కుదరకపోవడంతో నాని-సుధీర్ బాబుతో తీశానని అనుకోవడం తప్పు. అందులో ఎలాంటి నిజం లేదు.”

నిజానికి తను హీరోల్ని దృష్టిలో పెట్టుకొని కథలు రాయనని, కథ రాసిన తర్వాత హీరోల కోసం వెదుకుతానని చెబుతున్నాడు ఈ దర్శకుడు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.

V సినిమాలోని సైకో బాత్, పోలీసాఫీసర్ పాత్రల్ని నాని-సుధీర్ బాబు చేసినంత బాగా తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవరూ చేయలేరంటున్నాడు ఇంద్రగంటి. మిగతా హీరోలెవరైనా ఇలానే చేయలరేమో కానీ, ఇంతకంటే బాగా మాత్రం చేయలేరని ఢంకా భజాయించి మరీ చెబుతున్నాడు.