విశాఖ రాజధాని అన్న దగ్గర నుంచి ఏదో ఒకటి చెడుగా చెప్పాలన్న తాపత్రయంతో పచ్చ మీడియా పూనకాలే పోతోంది. విశాఖ అచ్చి రాని నగరం అన్నారు, సునామీల సిటీ అన్నారు, ఏకంగా సముద్రమే చీలిపోయి నగరాన్ని గుటుక్కున మింగేస్తుందనీ ప్రచారాలు చేశారు.
ఇక విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయి. క్షణాల్లో భస్మీపటలం అన్నారు. విశాఖలో ఉన్న రసాయనిక పరిశ్రమల వల్ల నగర భద్రత్ర ప్రశ్నార్ధకం అని కూడా కారు కూతలు కూశారు. ఇపుడు విశాఖ నేర నగరమని సరికొత్త ప్రచారం చేస్తున్నారు. రేపుల సిటీ అంటున్నారు. ఇంతకంటే దారుణం, బాధాకరం ఉంటుందా. విశాఖ ప్రశాంతంగరమని ఇదే పచ్చ మీడియా అయిదేళ్ల బాబు పాలనలో రాసింది.
అంతేనా జగన్ వచ్చిన కొత్తల్లో కూడా విశాఖ గురించి నెగిటివ్ వార్తలు లేవు. ఎపుడైతే పాలనారాజధాని అని ప్రకటించారో నాటి నుంచే విషం చిమ్మేందుకు రెడీ అయిపోయారు. విశాఖలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయట. ఆరు నెలల్లో 90కి పైగా రేపులు జరిగాయట. అంటే సగటున రెండు రోజులకు ఒక మానభంగం విశాఖలో జరుగుతోందని లెక్కలు కడుతున్నారు.
అంతేనా కబ్జాలుట, నేరాలుట. ఇలా విశాఖ ఏపీలోనే అగ్ర స్థానంలో నేరాలూ ఘోరాల్లో ఉందిట. ఇంకా నయం దేశంలో నంబర్ వన్ అనలేదు. అవును గానీ.. ఇంతకీ విశాఖ ఈ ఆరేడు నెలల్లో పుట్టిన నగరమా. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన నగరం మీద ఇంతలా విషం చిమ్మడం అంటే నేరం ఇక్కడ పుట్టలేదు, విశాఖ ను ద్వేషించే వారి మెదళ్ళలో పుట్టింది, అందుకే ఈ చిల్లర రాతలూ, కారుకూతలూనూ అంటున్నారు విశాఖవాసులు, మేధావులు.