శ్రీలీల‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు

ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పుష్ప-2లో కిస్సిక్ సాంగ్ చేసిన తర్వాత ఈమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విశేషాలు బయటకొచ్చాయి. Advertisement శ్రీలీల…

ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పుష్ప-2లో కిస్సిక్ సాంగ్ చేసిన తర్వాత ఈమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విశేషాలు బయటకొచ్చాయి.

శ్రీలీల తెలుగమ్మాయనే విషయం తెలిసిందే. ఆమె తల్లిది ఆంధ్రప్రదేశ్. అయితే శ్రీలీల మాత్రం అమెరికాలో పుట్టింది. తను అమెరికాలో పుట్టి, అక్కడే చాన్నాళ్లు చదువుకున్నానని తెలిపింది శ్రీలీల. అయితే ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడతారంట. అలా తెలుగు వచ్చిందంటోంది.

ఆమె జీవితాశయం హాస్పిటల్ స్థాపించడం. ప్రస్తుతం మెడిసిన్ చేస్తున్న ఈ హీరోయిన్, డెర్మటాలజిస్ట్ అవ్వాలనేది తన కోరికగా చెప్పుకొచ్చింది. చిన్నప్పట్నుంచి చదువుకోవడం, డాన్స్ ప్రాక్టీస్ చేయడం తప్ప ఇంకోటి తెలియదంట.

పెద్దయ్యాక సినిమాల్లోకి రావడంతో.. చదువు, డాన్స్ తో పాటు సినిమాలు కూడా పనిగా మారిందని, అంతకుమించి ఇతర పనులేవీ పెట్టుకోనని తెలిపింది. అంటే దానర్థం, ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నానని, ఎవ్వరితో రిలేషన్ షిప్ లో లేనని.

ఇదే క్రమంలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపెట్టింది. శ్రీలీల ప్రేమ వివాహం చేసుకోదంట. బుద్ధిగా ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటుందంట. తన ఇంట్లో సంప్రదాయాల్ని ఎక్కువగా ఫాలో అవుతామని, పెళ్లి విషయంలో కూడా పెద్దలదే తుది నిర్ణయమని అంటోంది.

ఇక జీవితంలో మరపురాని సంఘటనను కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్తే… అక్కడో జంట శ్రీలీలను కలిసిందంట. తమ కూతురుకు భగవంత్ కేసరిలో శ్రీలీల పోషించిన పాత్ర పేరును పెట్టుకున్నారట. అది నా మనసుకు బాగా హత్తుకుందని అంటోంది.

ప్రస్తుతం డాన్సింగ్ క్వీన్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్, త్వరలోనే తనను సింగర్ గా, చెఫ్ గా కూడా చూస్తారంటోంది. తీరిక వేళల్లో ఇంట్లో అమెరికన్ రుచులు వండుతుందంట శ్రీలీల.

8 Replies to “శ్రీలీల‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు”

  1. మీరు అందరూ ఆమె క్యాస్ట్ తెలుసుకుని తిట్టాలనో, పొగడాలనో ఎంకి-అన్నయ్య ఆశ..మీరు ఆ కోరిక తీర్చకపోతే అన్నయ్య వెబ్సైట్ కి హిట్స్ వచ్చేది ఎలా.? అసలే అన్న పార్టీ రూలింగ్ లో కూడా లేకపాయే..

Comments are closed.