ఎంపీ గురుమూర్తి డిమాండ్ మోడీ చెవికెక్కుతుందా?

కేంద్రప్రభుత్వం దృష్టిలో దక్షిణాది రాష్ట్రాలు నిత్యం వివక్షకు గురవుతూ ఉంటాయనే సంగతి ఇవాళ్టి ఆరోపణ కాదు. అనాదిగా ఉన్నదే. కేంద్రప్రభుత్వంలో ఉత్తరాది పాలకులే పైచేయిగా ఉంటున్న పరిస్థితులు, ప్రధానులు గా ఎక్కువమంది ఉత్తరాది నేతలు…

కేంద్రప్రభుత్వం దృష్టిలో దక్షిణాది రాష్ట్రాలు నిత్యం వివక్షకు గురవుతూ ఉంటాయనే సంగతి ఇవాళ్టి ఆరోపణ కాదు. అనాదిగా ఉన్నదే. కేంద్రప్రభుత్వంలో ఉత్తరాది పాలకులే పైచేయిగా ఉంటున్న పరిస్థితులు, ప్రధానులు గా ఎక్కువమంది ఉత్తరాది నేతలు రావడం, దక్షిణాది నేతలు ప్రధాని బాధ్యతల్లోకి వచ్చిన పరిమిత సందర్భాల్లో వారికి నిర్ణయాలపరంగా పూర్తి స్వేచ్ఛ లేని వాతావరణం ఇవన్నీ కలిసి.. కేంద్రప్రభుత్వం నిత్యం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షతోనే సాగుతుంటుందనే అభిప్రాయాన్ని అందరిలో కలిగిస్తూ వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి ఎంపీ గురుమూర్తి లేవనెత్తిన డిమాండ్ చాలా సహేతుకంగానూ, ఆలోచింపజేసేదిగానూ ఉంది.

ఏడాదికి కనీసం రెండు పార్లమెంట్ సెషన్స్ అయినా దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించాలని ఎంపీ గురుమూర్తి ప్రధానికి లేఖ రాశారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అందరూ ఈ డిమాండ్ కు మద్దతివ్వాలని కూడా ఆయన కోరుతున్నారు. జాతీయ సమగ్రతకు ఇది మేలు చేస్తుందని గురుమూర్తి అంటున్నారు.

ప్రత్యేకించి బిఆర్ అంబేద్కర్ కూడా ఇలాంటి ప్రతిపాదనను ‘భాష పాలిత రాష్ట్రాలు’ అనే పుస్తకంలో ప్రస్తావించినట్టు గురుమూర్తి గుర్తుచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించే విషయంలో విశాల దృక్పథంతో ఉండాలని నాటి ప్రధాని వాజపేయి కూడా చెప్పినట్టుగా గురుమూర్తి గుర్తు చేస్తున్నారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రెండు రాజధానులు ఉంటాయి. రాష్ట్రపతికి హైదరాబాదులో శీతాకాలపు నివాసగృహం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణ లక్ష్యంతో మూడు రాజధానులు ప్రతిపాదించినప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేశారు. అమరావతిని ప్రధానంగా అసెంబ్లీ ఉండే శాసన రాజధానిగా కొనసాగిస్తూనే, ఏడాదికి ఒకటిరెండు అసెంబ్లీ సమావేశాలు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన విశాఖలో కూడా నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇలాంటి ఏర్పాటు అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం పట్ల కొంత నమ్మకం కలిగిస్తుందనే సంగతి నిజమే.

విశాలమైన భారతదేశంలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నిత్యం వివక్షకు గురవుతున్నాయనే వాదన ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల్లో ప్రబలంగా ఉంది. అలాంటి నేపథ్యంలో గురుమూర్తి ప్రతిపాదనను మోడీ అంగీకరిస్తే గనుక.. చిన్న ఉపశమనం అవుతుంది. అయితే అదే జరిగితే.. కేంద్రం ఏ నగరాన్ని పార్లమెంటు సమావేశాల నిర్వహణకు అనువుగా ఎంచుకుంటుంది. ఎక్కడ రెండో పార్లమెంటును ఏర్పాటుచేస్తుంది? అనేది ఇంకో చర్చ అవుతుంది.

18 Replies to “ఎంపీ గురుమూర్తి డిమాండ్ మోడీ చెవికెక్కుతుందా?”

      1. అపుడు పార్లమెంట్ లో కూడా ప్రతిపక్ష

        హోదా అడుగుతాడు అన్న..లేవెనన్న..

  1. gurumurthy గారు ja*** కన్నా 1000000% better, పార్టీ అధ్యక్షుణ్ణి చేసి ja*** పాలిటిక్స్ నుండి రిటైర్ అయితే మంచిది!!

  2. పార్లమెంటు ఒక చొట ఉంటె అది వివక్ష అయిపొదు!

    .

    వివక్ష అంటె చంద్రబాబు మొదలు పెట్టాడు, చంద్రబాబు అడిగితె అక్కడి రైతులు అన్నెసి భూములు ఇచ్చారు కాబట్టి నెను అక్కడ విద్వంసం చెస్తాను అనటం. 34 వెల ఎకరాలు సెకరించి అక్కడ కెవలం 10 రొజుల పాటు రెండు సెస్సన్లు అస్సెంబ్లీ పెడతాను అనటం వివక్షె!

    1. కొపందీసి ఇప్పుడు సుప్రీం కొర్ట్ ఒక రాష్ట్రంలొ, పార్లమెంటు మరొ రాష్ట్రంలొ, సెకరెట్రీ మరొ మరొ రాష్ట్రంలొ, PM ఆఫిస్ మరొ రాష్ట్రంలొ, రాష్ట్ర పతి నివాసం మరొ రాష్ట్రంలొ పెట్టాలి అంటాడా?

  3. వివక్ష లెకుండా అన్ని ప్రంతాలూ అబిరుద్ది చెయటం అంటె ఇది.

    .

    ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టెక్నొలజి (IIT)- తిరుపతి

    ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇంఫర్మెషన్ టెక్నొలజి (IIIT)- శ్రీ సిటి

    ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మ్యనెజ్మెంట్ (IIM)- విశాకపట్టణం

    ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇంఫర్మెషన్ టెక్నొలజి డిజైన్ యండ్ మ్యనుఫ్యాక్చరింగ్ (IIITDM)- కర్నూల్

    ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ సైన్స్ ఎడుకషన్ యండ్ రీసేర్చ్ (IISER)- తిరుపతి

    నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టెక్నొలజి , ఆంధ్రప్రదెష్ (NIT)- తడెపల్లిగూడేం

    నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఒర్షనొగ్రఫి – విశాకపట్టణం

    నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ డిజైన్ (NID) – విజయవాడ

    నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఒర్షన్ టెక్నొలజి – నెల్లూరు

    నేషనల్ ఎకాడమి ఆఫ్ కస్టంస్ ఇండైరెక్ట్ ట్యాక్షెస్ యండ్ నార్కొటిక్స్ (NACITN) – హింధుపురం

    ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ పెట్రొలియం అంద్ ఎనర్జి (NIPE)- విశాకపట్టణం

    ఇండియన్ కలినరి ఇన్స్టిట్యుట్ (ICI)- తిరుపతి

    ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టూరిజం యండ్ ట్రావెల్ మ్యనెజ్మెంట్ (IITTM)- నెల్లూరు

    ఆల్ల్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) – మంగళగిరి

    ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ (IIFT) – కాకినాడ

    సెంట్రల్ యూనివర్సిటి ఆఫ్ ఆంధ్రప్రదెష్ – అనంతపూర్

    సెంట్రల్ ట్రిబల్ యూనివర్సిటి ఆఫ్ ఆంధ్రప్రదెష్ – విజయనగరం

    డ్ర్. ఆబ్దుల్ హక్ ఊర్దు యూనివర్సిటి – కర్నూల్

  4. ఇలా సొల్లు రాసే ముందు మీ వైస్సార్ హవా, DMK సభ్యుల హవా నడిచిన యూపీఏ పాలన లో ఎందుకు ఇలాంటివి జరగలేదో ఆలోచించుకోవడం మంచిది.

  5. దక్షిణాది వివక్ష, దక్షిణాది రాష్ట్రాల కి 2014 తర్వాతే కనిపిస్తుంది, కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అస్సలు కనపడదు!

Comments are closed.