ఆ రోజు ఏం జరిగిందంటే.. హీరోయిన్ వేదన

ఈమధ్య రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మంచంపై పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఆమె సెల్ఫీ కూడా పోస్ట్ చేసింది. తను జిమ్ లో గాయపడ్డానని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని…

ఈమధ్య రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మంచంపై పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఆమె సెల్ఫీ కూడా పోస్ట్ చేసింది. తను జిమ్ లో గాయపడ్డానని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి రెట్టించిన ఉత్సాహంతో మీ ముందుకొస్తానంటూ ఆమె ప్రకటించింది.

చెప్పినట్టుగానే ఆమె కోలుకుంది, తిరిగి సినిమాలు, ఫొటోషూట్స్ తో బిజీ అయింది. ఇప్పుడు తన యాక్సిడెంట్ పై పూర్తిస్థాయిలో స్పందించింది. జీవితంలో అనుభవించిన అత్యంత బాధ ఇదేనంటోంది రకుల్.

“అక్టోబర్ 5, నేను మరిచిపోలేని రోజు. ఎప్పట్లానే జిమ్ కు వెళ్లాను. 80 కిలోలు లిఫ్టింగ్ చేశాను. వెన్నెముకలో నొప్పి వచ్చినట్టు అనిపించింది. నేను పట్టించుకోలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత నేరుగా షూటింగ్ కు వెళ్లాను. రాత్రి ఇంటికొచ్చేసరికి వంగలేకపోయాను. నా దుస్తులు నేను మార్చుకోలేకపోయాను.”

అయినప్పటికీ షూటింగ్ కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోయానని వెల్లడించింది రకుల్. అలా 10వ తేదీ వరకు నెట్టుకొని వచ్చిందంట.

“అక్టోబర్ 10.. నేను నా పుట్టినరోజు పార్టీకి సిద్ధమౌతున్నాను. ఉన్నట్టుండి సెడన్ గా నడుము నుంచి కింది భాగం మొత్తం అచేతనమైంది. నేను నా కింది భాగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. సడెన్ గా బీపీ పడిపోయింది. అంతే ఏం జరిగిందో అర్థమయ్యేలోపే స్పృహ తప్పిపోయాను.”

ఆ తర్వాత తనను హాస్పిటల్ కు తీసుకెళ్లడం లీలగా గుర్తుందని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్. నిజానికి తను 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నానని చెప్పినప్పటికీ, అది బెడ్ రెస్ట్ కాదని, పూర్తిగా మంచానపడ్డానని చెప్పుకొచ్చింది.

ఇప్పుడిప్పుడే షూటింగ్స్, ఫొటోషూట్స్ తో బిజీ అవుతోంది రకుల్. అయితే గాయం మాత్రం తగ్గలేదని, ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉన్నానని తెలిపింది.

5 Replies to “ఆ రోజు ఏం జరిగిందంటే.. హీరోయిన్ వేదన”

Comments are closed.