బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరోసారి బాలీవుడ్ సినీ పరిశ్రమపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తను నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గడిచిన పదేళ్లలో బాలీవుడ్ ఎంతో మారిందని.. చాలా మంది కొత్తవాళ్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారని.. టాలెంట్ ఆధారంగానే యాక్టర్లను ఎంచుకోవాలి తప్పా పాలిటిక్స్ ఉండొద్దు అంటూ సూచనలు చేసింది.
బాలీవుడ్ లోని ప్రస్తుత పరిస్థితి బాగుందని.. టాలెంట్ ఉన్న రచయితలు, దర్శకులు, నటీనటులు.. ఇలా ఎంతోమంది బయటవాళ్లు పరిశ్రమలోకి అడుగుపెట్టారని.. వారిని చూసి ఎంతో ఆనందించానంటూ సంతోషం వ్యక్తం చేసింది. తను కెరీర్ మొదలుపెట్టినప్పుడు పరిస్థితులు ఇలా లేవని.. తనలాంటి నటీనటులు పోరాటం చేయబట్టే పరిస్థితులు ఇలా మారాయంటూ చెప్పుకోచ్చింది.
మనం ఫెయిల్ అయినప్పుడే మన ప్రపంచం మరింత కిందకు తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే, మనుషుల స్వభావం అదే. అలాంటి, సమయంలో మనం మన వాల్యూ తెలుసుకుని ముందుకు సాగిపోవాలన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ప్రియాంక ఓ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ లో కొంతమంది కావాలని తనను సైడ్ చేశారని.. కొంతమంది టార్గెట్ చేసి మూలకు నెట్టేసి ఛాన్సులు రాకుండా చేశారని.. బాలీవుడ్ లో ఉన్న పాలిటిక్స్ లో తను ఇమడలేకపోయానంటూ అవేదన వ్యక్తం చేసింది. అందుకే అమెరికాకు వచ్చేసి ఇక్కడే సినిమాలు చేస్తున్నాను అని కామెంట్స్ చేసింది. అలాగే ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలని తీసుకొని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కరణ్, అతని మాఫియా చెప్పినట్టు ప్రియాంక మీద చాలా నెగిటివ్ వార్తలు రాసి ఆమె ఇండియాని వదిలి వెళ్లేలా చేశారంటూ విమర్శలు కూరిపించిన విషయం తెలిసిందే.