ఫ్యామిలీ మేన్ సిరీస్ లో సమంతతో ఓ బోల్డ్ సీన్ ఉంది. దానికే చాలామంది చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు అంతకుమించిన బోల్డ్ సీన్ లో సమంత నటించబోతోందా? చాలామంది అవుననే అంటున్నారు.
ఫ్యామిలీ మేన్ సిరీస్ ను తెరకెక్కించిన రాజ్-డీకే దర్శక ద్వయం, ఇప్పుడు మరోసారి సమంతను రిపీట్ చేశారు. ఈసారి సిటాడెల్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా అమెజాన్ కే.
ఈ సిరీస్ లో సమంతను బోల్డ్ గా చూపించారనే టాక్ నడుస్తోంది. దీనికి కారణం తాజాగా రిలీజైన ఇంగ్లిష్ వెర్షన్ ట్రయిలర్.
సిటాడెల్ ఇంగ్లిష్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. ఈ ట్రయిలర్ లో ప్రియాంకను అర్థనగ్నంగా చూపించారు. తను కొన్నిచోట్ల బోల్డ్ గా నటించాననే విషయాన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ప్రియాంక కూడా నిర్థారించింది.
సో.. ఇండియన్ వెర్షన్ కు వచ్చేసరికి సమంతతో కూడా ఆ బోల్డ్ సన్నివేశాల్ని రిపీట్ చేయించారా లేక కాస్త డోస్ తగ్గించారా అనేది తేలాల్సి ఉంది. రొమాన్స్ సంగతి పక్కనపెడితే, ఈ సిరీస్ లో యాక్షన్ మాత్రం దండిగా ఉంది. సమంత చేతులకు ఇదివరకే గాయాలయ్యాయి.