Advertisement

Advertisement


Home > Movies - Movie News

జంబల్ హాట్ లేడీస్ తో టిల్లూ

జంబల్ హాట్ లేడీస్ తో టిల్లూ

డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా తీసిన టిల్లూ స్క్వేర్ కోసం బాగానే హైప్ క్రియేట్ చేశారు. అదే ఊపులో మంచి రేట్లకు సినిమాను అమ్మారు. అయితే ఇచ్చిన హైప్ కు, అమ్మిన రేట్లకు తగ్గ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం కనిపించడం లేదు.

మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు మేకర్స్ ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కనిపించడం లేదు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చింది టిల్లూ స్క్వేర్ రిలీజ్ ట్రయిలర్. ఎంత కావాలంటే అంత హైప్ ను పంప్ చేసే విధంగా ఉంది ఈ రిలీజ్ ట్రయిలర్.

ఒరిజినల్ మూవీలో ఆడియన్స్ కు ఏఏ అంశాలు నచ్చాయో, వాటన్నింటినీ తాజా ట్రయిలర్ లో పొందుపరిచారు. 'ఇప్పుడే నోట్లో పెద్ద ముద్ద పెట్టారు' అనే డైలాగ్ నుంచి 'జంబల్ హాట్ లేడీస్ ను ఎక్కడ్నుంచి పడతావ్' అనే డైలాగ్ వరకు అన్నీ యూత్ ను ఎట్రాక్ట్ చేసేవే.

ఇక మార్కస్ తో పాటు.. టిల్లూ తల్లిదండ్రుల పాత్రల్ని కూడా ట్రయిలర్ లో చూపించారు. ఇలా టోటల్ గా డీజే టిల్లూ సెటప్ మొత్తం సీక్వెల్ లో ఉందని ఈ ట్రయిలర్ లో చెప్పకనే చెప్పారు. దీంతోపాటు, అత్యంత కీలకమైన హీరోయిన్ పాత్రపై కూడా చిన్న క్లూ ఇచ్చారు. అప్పటి రాధికలానే ఈసారి కూడా హీరోయిన్ పాత్ర కిలాడీ అనే విషయాన్ని స్పష్టం చేశారు.

తాజా ట్రయిలర్ తోనైనా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతాయోమో చూడాలి. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?