ఫ్యామిలీ ఆడియన్స్ పై కూడా జాలి లేదా?

రేట్లు పెంచి మొదటి వారంలోనే సేఫ్ జోన్ లోకి వెళ్లాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సంగతి దేవుడెరుగు.

ఆంధ్రప్రదేశ్ లో గేమ్ ఛేంజర్ కు భారీగా టికెట్ రేట్లు పెంచారు. భారీగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, ఎంత పెంచినా చూస్తారు. అదే విధంగా డాకు మహారాజ్ కు కూడా పెంచారు. బాలయ్యకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే కాబట్టి ఎంత పెంచినా చూస్తారు. మరి ఫ్యామిలీ మూవీకి కూడా పెంచితే ఎలా?

“సంక్రాంతికి వస్తున్నాం” సినిమా మేటర్ ఇది. వెంకటేష్ పక్కా ఫ్యామిలీ హీరో. పైగా “సంక్రాంతికి వస్తున్నాం” అనే టైటిల్ తో పక్కా ఫ్యామిలీ మూవీ తీశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వీళ్ల టార్గెట్ కూడా ఫ్యామిలీ ఆడియన్సే. ఇదే విషయాన్ని దర్శకుడు చెప్పాడు కూడా. మరి టికెట్ రేట్లు పెంచితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా వస్తారు?

కుటుంబాలతో కలిసి థియేటర్లకు రావాలంటే టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి కదా. వెంకీ సినిమాకు కూడా 125 రూపాయలు, వంద రూపాయలు చొప్పున పెంచేశారు. అంటే, మొదటి 10 రోజులు వెంకటేశ్ సినిమాకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అక్కర్లేదా?

వరుసగా రెండో ఏడాది సంక్రాంతి బరిలోకి వస్తున్నాడు వెంకీ. గతేడాది సంక్రాంతికి సైంధవ్ వచ్చింది, డిజాస్టర్ అయింది. బహుశా, ఆ భయం మేకర్స్ లో ఉన్నట్టుంది. అందుకే ఇలా రేట్లు పెంచి మొదటి వారంలోనే సేఫ్ జోన్ లోకి వెళ్లాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సంగతి దేవుడెరుగు.

8 Replies to “ఫ్యామిలీ ఆడియన్స్ పై కూడా జాలి లేదా?”

  1. ఇందులో వారు వీరు అననేలా అందరూ అందిన కాడికి దోచుకోవడమే. బాలయ్య నిర్మాచలైన చిరు నిర్మాతలైన రామ్ చరణ్ నిర్మాచలైన వెంకటేష్ నిర్మాతలైన అందరూ డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నారు కదా. మరి వారి డబ్బులు వారికి రావాలి కదా. కుటుంబ సమేతంగా సినిమాలు చూడాలనుకున్నవారు వారం పది రోజులు తర్వాత చూస్తారు. అయినా నాకు తెలియక అడుగుతాను కుటుంబ సమేతంగా చూచే సినిమాలు ప్రస్తుతం ఉన్నాయా ? ఎవరైనా ఆదిశగా ఆలోచించి సినిమాలో తీస్తున్నారా ? విలువలు మరిచి ప్రతి ఒక్కరు వ్యాపార దృక్పథంతోనే ఆలోచిస్తున్నారు కానీ మిగిలినవన్నీ గాలికి వదిలేశారు.. వెంకటేష్ గారు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోనేమో కానీ ప్రస్తుతం ఆయన కూడా పక్కా మాస్ మసాలా హీరో అయ్యారు మసాలా

  2. High budget movies should try to capture national market instead of increasing prices.

    Movies having local scope should be made with limited budget by keeping remunerations low instead of increasing prices

  3. Nowadays market became like:

    Star heroes: Releasing movies with high prices, audience are waiting for the prices to be low for a week or two, after that they feel like to watch it in OTT by waiting for another few weeks

    other movies: audience like me are directly waiting for them to watch in OTT

    sankranthi: situations like Sankranthi is different, though the prices are high, public goes for it to take the Alludu for a movie, this is the cash point of the movie makers. This is happening because it became like, movie is the only entertainment choice public has in the state.

    This can be stabilised only when public starts looking at other choices like going for short trips, going to beach, hill station, tourist places, etc with almost similar budget rather than paying high ticket prices

  4. In fact highly paid hero’s should look forward into profit sharings with minimal pay cheques, rather than high pay cheques, this will reduce lot of budget for the movie and makes hero to earn based on their star image in the industry

  5. Matldithe OTT antaru, anee cinemalu oke OTT channel lo ravu. Oko cinema oko OTT lo. Konee OTT lu early watch pay option. Inka mobile lo movie chusthe eye effect and headaches ippudu prathi doctor cheptundhee idhe. OTT vunte intlo pillalu TV kee arhuku povachu. Logically anee OTT channels kee subcription fees and no safe for children . OTT lo chetta kuda vuntadhee. So pothe poyindhee oka movie chustharu theater lo leka pothe tv channel lo. OTT is not good for health and wealth.

Comments are closed.