పూన‌మ్‌కౌర్‌కు ఏమైనా పిచ్చా?

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో ఫిర్యాదు చేసి చాలా కాల‌మైంది.

న‌టి పూన‌మ్‌కౌర్ అప్పుడ‌ప్పుడు చేసే ట్వీట్లు వివాదాస్ప‌మ‌వుతుంటాయి. ఆమె ట్వీట్లు చూస్తే, పిచ్చా? లేక అమాయ‌క‌త్వ‌మా? అని పూన‌మ్‌పై జాలి క‌లుగుతుంద‌ని ప‌లువురు అంటున్నారు. తాజాగా పూన‌మ్ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.

“ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో ఫిర్యాదు చేసి చాలా కాల‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు “మా” దానిపై స్పందించ‌లేదు. నా జీవితాన్ని నాశ‌నం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అత‌న్ని చిత్ర‌ప‌రిశ్ర‌మ ఇప్ప‌టికీ పెద్ద మ‌నిషిగానే ప్రోత్స‌హిస్తోంది” అని ఆమె త‌న మ‌న‌సులో బాధ‌ను మ‌రోసారి బ‌య‌ట పెట్టారు.

ఏ రంగంలోనైనా ఉన్న‌త స్థాయికి చేరిన వారిపై ఆరోప‌ణ‌లు ఇస్తే, చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి స‌మాజంలో లేద‌ని పూన‌మ్‌కౌర్‌కు తెలియ‌ద‌ని అనుకోవాలా? లాభ‌న‌ష్టాల్ని బేరీజు వేసుకుని, ఏ వ్య‌వ‌స్థ అయినా ఆయా వ్య‌క్తుల‌పై స్పందిస్తూ వుంటుంది. స్పందించ‌క‌పోవ‌డం కూడా వ్యూహంలో భాగంగానే చూడాలి. త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుల‌కు ఉన్న పాపులారిటీ ఏంటో తెలిసి కూడా, ఆయ‌న‌పై విచారించి, తాను కోరుకున్న‌ట్టుగా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆశించే పూన‌మ్‌లాంటి న‌టుల్ని స‌మాజం పిచ్చోళ్లగా చూస్తుంది.

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ ఫిర్యాదులో ఏముందో, అయినా అవ‌న్నీ నిజ‌మే అని “మా” విశ్వ‌సించాల‌ని ఆమె ఎందుకు అనుకుంటున్నారో అనే ప్ర‌శ్న ఖ‌చ్చితంగా త‌లెత్తుతుంది. అభాగ్యులు, ప‌లుకుబ‌డిలేని వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకుని, వ్య‌వ‌స్థ‌లు ప‌ని చేస్తున్నాయ‌ని అప్పుడ‌ప్పుడు కొన్ని చ‌ర్య‌ల్ని చూస్తుంటాం. అయినా త్రివిక్ర‌మ్‌పై ప‌దేప‌దే సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తూ, ఆమె ఏమి ఆశిస్తున్న‌దో అర్థం కావ‌డం లేద‌నే టాక్ కూడా లేక‌పోలేదు.

8 Replies to “పూన‌మ్‌కౌర్‌కు ఏమైనా పిచ్చా?”

  1. ఇలాంటి ఆర్టికల్స్ ద్వారా మనదొక అరాచక వ్యవస్థ అనే విషాన్ని చదివే వారి లోకి ఎక్కిస్తున్నావేరా గాండు!

  2. Every time she mentions that he has ruined her life… Does she has dare to say what he has done… According to the news in film city he has not given the role in attarintiki daaredhi.. As Samantha sister… How can a character artist be given a second heroine character… Does she has any common sense

Comments are closed.