జ‌గ‌న్ సొంత జిల్లాలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిథ్యం ఏదీ?

జ‌గ‌న్ సొంత జిల్లాకు సంబంధించి 52 మందితో కూడిన క‌మిటీని చూస్తే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

వైసీపీని బ‌లోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారు. మ‌రీ ముఖ్యంగా సంక్రాంతి త‌ర్వాత జిల్లాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో, ఆ లోపు అన్ని స్థాయిలో క‌మిటీల ఏర్పాటు పూర్తి చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ సొంత జిల్లాకు సంబంధించి 52 మందితో కూడిన క‌మిటీని చూస్తే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. నా అక్క‌చెల్లెళ్లు అంటూ మాట‌కు ముందు, ఆ త‌ర్వాత ప్రేమ ఒల‌క‌బోసే వైఎస్ జ‌గ‌న్‌, ఆచ‌ర‌ణ‌లో మాత్రం ప్ర‌ద‌ర్శించ‌లేద‌నేందుకు సొంత జిల్లా వైసీపీ క‌మిటీనే నిద‌ర్శ‌నం.

బ‌హుశా ఒకే ఒక్క మ‌హిళ‌కు క‌మిటీలో చోటు క‌ల్పించిన‌ట్టుంది. వైస్ ప్రెసిడెంట్ మొద‌లుకుని ట్రెజ‌ర‌ర్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, అధికార ప్ర‌తినిధి త‌దిత‌ర పోస్టుల‌ను భ‌ర్తీ చేశారు. వీటిలో మ‌హిళ‌ల‌కు నామ‌మాత్రంగా కూడా చోటు ద‌క్క‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. జ‌గ‌న్ సొంత జిల్లాలో మ‌హిళా నాయ‌కురాళ్లు ఉన్న‌ప్ప‌టికీ, వారికి త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

ఇలాగైతే పార్టీ కోసం ప‌ని చేయాల‌న్న ఉత్సాహం మ‌హిళ‌ల్లో ఎందుకు వుంటుంద‌ని వైసీపీ నాయ‌కులే ప్ర‌శ్నిస్తున్నారు. క‌మిటీ కూర్పు స‌రిగా లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక సామాజిక వ‌ర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డం, మిగిలిన వాళ్ల‌కు మొక్కుబ‌డిగా ప‌ద‌వులు ఇవ్వ‌డం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా ఈ క‌మిటీలో మార్పుచేర్పులు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం వుంద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.

4 Replies to “జ‌గ‌న్ సొంత జిల్లాలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిథ్యం ఏదీ?”

  1. హే వూకో..ఒకటే సోది.చచ్చిన పాము గురుంచి ఊకదంపుడు రాతలు…అంత పొడుగు, ఇంత లావు,పడగ ఇప్పుద్ధి, బుసలు కొట్టుద్ధి…వేరే ఏదన్నా యాపరం చూస్కో GA.. ఎందుకు మమ్మల్ని సా వ మింగుతావు!

  2. ఇంతకు ముందు ఇస్తే.. ఇంట్లో కూర్చోపెట్టారు.. అంత అవసరం ఎం లేదు.. కావాలంటే వాళ్లే కస్టపడి సంపాదిస్తారు..

    1. అవును ఇంకో మహిళకి ఇస్తే షర్మిల, సునీతా, విజయమ్మ ల బొమ్మ తిరగబడితే?

Comments are closed.