సంక్రాంతికి వస్తున్నాం… ఓటిటి డన్!

రెండు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లకు మినిమమ్ గ్యారంటీ స్కీమ్ మీద సినిమాను మంచి రేటుకు అమ్మే దిశగా చర్చలు సాగుతున్నాయి.

రిస్క్ చేస్తే తప్ప సక్సెస్ రాదు అంటారు. అలా రిస్క్ చేశారు నిర్మాత దిల్ రాజు. తన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సంక్రాంతి బరిలోకి దింపారు. కానీ అలా దింపడానికి ఓటిటి స్లాట్ అడ్డం పడింది. అయినా ధైర్యం చేశారు. నాన్-థియేటర్ అమ్మకాలు పూర్తి కాకపోయినా, సంక్రాంతికి రావాలని డిసైడ్ అయ్యారు.

ఈ రిస్క్‌ను అధిగమించేందుకు వీలుగా సినిమా నిర్మాణ వ్యయం తగ్గించాలని ప్లాన్ చేశారు. సినిమాను 55 కోట్లకు కాస్త అటు ఇటుగా పూర్తి చేశారు. కేవలం థియేటర్ ఆదాయం మీదనే ఆధారపడి విడుదలకు రెడీ అయ్యారు.

కానీ, సినిమాకు మంచి బజ్ రావడం, పాటలు హిట్ కావడం కలిసివచ్చాయి. ఆడియో రైట్స్ అమ్ముడుపోయాయి. శాటిలైట్ రైట్స్ డీల్ దాదాపు క్లోజింగ్ స్టేజ్‌కి వచ్చింది. లేటెస్ట్‌గా ఓటిటి డీల్ కూడా డిస్కషన్‌లోకి వచ్చింది. రెండు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లకు మినిమమ్ గ్యారంటీ స్కీమ్ మీద సినిమాను మంచి రేటుకు అమ్మే దిశగా చర్చలు సాగుతున్నాయి.

ఈ డీల్స్ అన్నీ ఈ వారంలో క్లోజ్ అయితే, నిర్మాతగా దిల్ రాజు, దర్శకుడిగా అనిల్ రావిపూడి సక్సెస్ అయినట్టే. అయితే ఓటిటి డీల్ అయినా, సినిమా ఇప్పుడే రాదు. ఎందుకంటే వాటికి ఇప్పట్లో స్లాట్ లేదు. వీలు చూసుకుని వదులుతాయి. ఆ విధంగా కూడా థియేటర్ రన్ పరంగా సినిమాకు అడ్వాంటేజ్ అవుతుంది.

4 Replies to “సంక్రాంతికి వస్తున్నాం… ఓటిటి డన్!”

Comments are closed.