హీరోలు వెళ్లేది హీరోలుగా కాదు

మన హీరోలు కేవలం హీరోలు మాత్రమే కాదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లు, ఎగ్జిబిటర్లు

ప్రభుత్వం హీరోలను ఎందుకు పిలవాలి? నిర్మాతలను పిలవాలి కానీ, అంటూ లా పాయింట్ లాగారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన కూడా హీరోనే. అందుకే ఎక్కడో ఇబ్బంది అయినట్లు ఉంది, తమంతట వారు వెళ్లి ముఖ్యమంత్రి ముందు కూర్చోవడం ఏమిటి అని. లేదా అలా వెళ్లి కూర్చున్న వారిలో తన అన్న మెగాస్టార్ కూడా ఉన్నారు కదా అని గుర్తు వచ్చి ఉంటుంది.

అసలు ఇంతకూ పవన్ చెప్పింది నిజమే.. హీరోలు ఎందుకు వెళ్లాలి రాజకీయ నాయకుల దగ్గరికి, అధికారంలో ఉన్న వారందరికీ? టికెట్ రేట్లు కావాల్సింది నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు కదా.

అంటే ఇక్కడ అసలు విషయం వేరే ఉంది. పవన్ చెప్పకుండా దాచిన విషయం.

అసలు మన హీరోల్లో కేవలం హీరోలు మాత్రమే ఎంత మంది ఉన్నారు? మన హీరోలు కేవలం హీరోలు మాత్రమే కాదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లు, ఎగ్జిబిటర్లు.. ఇంకా.. ఇంకా. అందుకే వాళ్లు అధికారం ముందు తల వంచక తప్పడం లేదు. కేవలం హీరోలు అయితే అది వేరు. స్టూడియోలు ఉన్నాయి కొందరికి, నిర్మాతలుగా, నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు చాలా మంది. థియేటర్లు ఉన్నాయి. పంపిణీ వ్యాపారాలు ఉన్నాయి.

వాటి కోసం వెళ్లాలి. అంటే హీరోలుగా వెళ్తారు కానీ హీరోల హోదాలో మాత్రం కాదు. కానీ జనాలకు మాత్రం హీరోలు వెళ్లినట్లు కనిపిస్తుంది.

ఇది ఒక పాయింట్. మరో పాయింట్ కూడా ఉంది.

అసలు టికెట్ రేట్లు పెరిగితే లాభం ఎవరికి? నిర్మాతగా.. ఎంత మాత్రం కాదు. హీరోలకే. హీరోలు భారీ రేట్లు తీసుకోవడం, భారీగా ప్యాడింగ్ కోరడం, భారీగా నిర్మాణాలు కోరడం వల్ల సినిమా ఖర్చు పెరుగుతోంది. ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఫలానా సినిమాటోగ్రాఫర్ కావాలి. ఫలానా హీరోయిన్ కావాలి. ఇలా ఖర్చు పెంచేది హీరోలే కదా. మరి ఆ ఖర్చు వల్లే కదా నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అందువల్లే కదా అదనపు రేట్లు, అదనపు షోలు అడిగే అవసరం వస్తోంది.

అంటే హీరోల కారణంగానే అన్నీ జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం ముందుకు హీరోలు ఎందుకు రాక తప్పదు. హీరోలు వెళ్తున్నది తమ కోసం మాత్రమే కాదు, తమ వ్యాపారాల కోసం. ఆ సంగతి తెలియక, లేదా దాచి పెట్టి పవన్ మాట్లాడారు అనుకోవాలి. ఈ కోణంలో ఆలోచిస్తే అప్పుడు అర్థం అవుతుంది హీరోలు ఎందుకు అధికారం ముందుకు వెళ్లి ఉంటారు అన్నది.

12 Replies to “హీరోలు వెళ్లేది హీరోలుగా కాదు”

  1. నాలుగు గొర్రెలు హై హై అంటే.. ఇంకేంటి నేనే దేబుడ్ని అని అనుకుంటున్నాడు.. అంతే..

    1. తండ్రి లేని మి గొఱ్ఱె బిడ్డ దేవుడు అవ్వలేదు అయ్యో.బటన్ నొక్కితే దేవుడు అవ్వరు.

  2. Asalu Politicians ki movies ki sambandam enti? Ea state lonu politicians involve avvatledhu movies matters lo…mari mee Sheam enduku ayyadu?oka person ni target cheyyadam kosam whole industry ni ibbandulu lo kavalani pettadu mari Dani gurinci kooda raayu ra musali nakkAA

  3. Eeyana swayamga vellaaru , kcr appointment kosam , 30 minutes wait chesaaru , adhey pani jagan chedi untey yemaney vaalluu,

    Leader ga emerge ayye person proper leader ga undatledhu , adhey mani adigithey nuv verey party supporters antaru ,

    Ninna game changer event chaala thapulu matladaru , chala leki maatalu matladaaru ,

    Dhil Raju ni , thrivikram ni vachi skills nerpinchandi maa vaallaki annadu ,

    Oka DCM ayyo undi chala improper matalu matladaadu , adhey mantey verey party supporters antaru

  4. 🤣🤣🤣 పవన్ కళ్యాణ్ నీ దేవుడు చెయ్యడం లో నువ్వొక సమిధ వి రా గ్రేట్ ఆంధ్ర.

    1. వాడొక పేద్ద వేస్టుగాడు…….. వేస్టుగాడిని దేవుడు చేసిన ఈ ga గాడు వేస్టున్నర వేస్టుగాడు

  5. సినిమా ఆడాలంటే జనాలు కావాలి, ప్రభుత్వాల అనుమతి కావాలి.. తెరమీద రంగుపూసుకుని ఆయవారానికి పోయే వీల్లు విజ్ఞత క్కోల్పోతె బొమ్మ తిరగబడుద్ది..

  6. Are we crazy enough to still follow entertainers as demigods? Aren’t we educated and matured enough? Movie is just for entertainment. A few people find more in xxx movies and clips. We can’t imagine the actors in our personal lives. Why this unnecessary importance to actors? No developed country citizens give a damn to actors or entertainers like this. There should be something else dominating here ? Focus on family and friends .. they are real heroes.

Comments are closed.