సినిమాకు ట్రయిలర్ కట్ చేసేది జనాలకు ఓ ఐడియా రావడం కోసం, బయ్యర్లకు ఓ ఆసక్తి ఏర్పడడం కోసం. పూరి జగన్నాధ్-రామ్ కాంబినేషన్ లో చార్మి నిర్మిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ట్రయిలర్ ఆ మధ్య వచ్చింది. బయ్యర్లకు ఆసక్తి కలిగించింది. సినిమా బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయింది. ఇక విడుదల వారంలోకి వచ్చేసింది. అందుకే డైరక్టర్ పూరి సినిమాకు ఓపెనింగ్స్ తీసుకువచ్చే పనిలో పడినట్లు కనిపిస్తోంది.
ఇటు డైరక్టర్, అటు హీరో ట్రాక్ రికార్డు కాస్త అటు ఇటుగా వుంది కాబట్టి, ఓపెనింగ్స్ బాగుండాలంటే ఏదో ఒకటి చేయాలని పూరి డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఓపెనింగ్స్ తెచ్చే ట్రయిలర్ ను కట్ చేసి వదిలారు. ఈ ట్రయిలర్ కటింగ్ విషయంలో నియమ నిబంధనలు ఏవీ పెట్టుకోలేదు. జస్ట్, కుర్రకారు గుండెలకు గాలం వేసి లాగే పని మాత్రమే పెట్టుకున్నారు.
ఇద్దరు హీరోయిన్లను ఏ రేంజ్ లో చూపించారో? వారి అందాలను ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేసారో? అదే ట్రయిలర్ లో చూపించారు. హీరోయిన్లతో హీరో కూడా వుంటాడు కాబట్టి, ఆ మేరకు రామ్ కూడా కనిపించాడు. ఇక ఇంకో ముచ్చట ఏమిటంటే, పూరి అంటే వన్ లైనర్లకు పెట్టింది పేరు కాబట్టి, ట్రయిలర్ లో వాటిని కూడా కాస్త వినిపించారు.
మొత్తంమీద ఈ ట్రయిలర్ టార్గెట్ రీచ్ అయితే ఇస్మార్ట్ శంకర్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది.