Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇక శెలవ్.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

ఇక శెలవ్.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా. నవంబర్ నెలలో కాస్తోకూస్తో క్రేజ్ తో రిలీజైన స్ట్రయిట్ సినిమాలు 2-3 మాత్రమే. వీటిలో ఒకటి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. పైగా థియేటర్లలో పెద్ద సినిమాలతో పోటీ లేదు. ఇలాంటి కొన్ని అనుకూల పరిస్థితుల మధ్య రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం రాబట్టలేకపోయింది.

సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వస్తే, ఆ లెక్క వేరు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దాన్ని హిట్ గా మలుచుకునేందుకు యూనిట్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం విషయంలో మాత్రం ఆ చొరవ పూర్తిగా కొరవడింది.

విడుదలకు ముందు ఏదో చేయాలన్నట్టుగా ప్రచారం చేశారు. చాలామంది ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ కాలేదు. అయినప్పటికీ మొదటి రోజు ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడంలో యూనిట్ పూర్తిగా ఫెయిలైంది. ఇలా సినిమా రిలీజైందో లేదో అలా అంతా చేతులు దులుపుకున్నారు. తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు.

జీ స్టుడియోస్ బ్యాకప్ తో తెరకెక్కింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా. సో.. నిర్మాతకు నాన్-థియేట్రికల్ రైట్స్ తలనొప్పి లేదు. ఆ విధంగా సగం సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత ప్రీ-రిలీజ్ బిజినెస్ లో మరో 4 కోట్ల రూపాయలొచ్చాయి. దీంతో అంతా తట్టాబుట్ట సర్దేసుకున్నారు. ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న అల్లరి నరేష్ కూడా ప్రచారం విషయంలో చొరవ చూపించకపోవడం బాధాకరం.

ఇవన్నీ ఒకవైపు ఇలా ఉంటే, మరోవైపు లవ్ టుడే అనే సినిమా వచ్చి, అల్లరోడి సినిమాను గట్టిగా దెబ్బకొట్టింది. ఈ శుక్రవారం హిట్-2, మట్టికుస్తీ సినిమాలొస్తున్నాయి. వీటిలో ఒక్క సినిమా నిలబడినా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఖాతా క్లోజ్ అయినట్టే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?