Advertisement

Advertisement


Home > Movies - Movie News

జరిగిన సంఘటనలతో టెన్త్ క్లాస్ డైరీస్

జరిగిన సంఘటనలతో టెన్త్ క్లాస్ డైరీస్

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో - ఛాయాగ్రాహకుడు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...     

'టెన్త్ క్లాస్ డైరీస్'తో దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాటోగ్రాఫర్ అంజి తో నాకు పరిచయం ఉంది. తమిళంలో నాతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సింది. అప్పుడు నా డేట్స్ కుదరలేదు. సినిమా చేయలేదు. ఫర్ ఎ చేంజ్... దర్శకుడు కథ చెప్పలేదు. నిర్మాత అచ్యుత రామారావు కథ చెప్పారు. ఆ తర్వాత తెలిసింది... ఆయనే కథ రాశారని! కథ విన్న వెంటనే 'మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగా. అప్పుడు రామారావు ఎమోషనల్ అయ్యారు. మా బ్యాచ్ లో జరిగిందని చెప్పారు. ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ తర్వాత జరిగిన సంఘటనలే ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'. అయితే, కొంత ఫిక్షన్ ఉంది. సినిమాలో క్యారెక్టర్లు ఎవరో ఒకరు రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ మెమొరబుల్ మూమెంట్స్. అటువంటి మూమెంట్స్ ను పిక్చరైజ్ చేశాం. 

బేసిక్ కంటెంట్... రీ యూనియన్. హరిశ్చంద్రుడు అయినా, రాముడు అయినా ఇంకొకరి జీవితంలో విలన్ అనుకోవచ్చు. ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది. మన జీవితంలో కరెక్టుగా ఉన్నా ఇంకొకరి జీవితంలో చెడ్డోళ్లు అవుతాం. తెలిసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి ఒక తప్పు వల్ల ఎంత మంది జీవితం ఎలా మారుతుందనేది కాన్సెప్ట్. రియాలిటీగా తీశాం. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకున్నాం. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్టైనింగ్ రోల్స్ కావడంతో ఈజీ అయ్యింది. ఒక మనిషి అఘోర అయ్యారు. ఆయన రీ యూనియన్ కి అలాగే వచ్చారు.

ప్రతిసారీ, ప్రతి చోట రీ యూనియన్ సక్సెస్ అని చెప్పలేం. మేం ట్రై చేశాం. వంద మందిలో ఎనిమిది మంది వచ్చారు. నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ భవన్స్ స్టూడెంట్. ఒకసారి మా వాళ్ళు ప్లాన్ చేశారు. రావడానికి రెడీ అయ్యా. చివరి క్షణంలో షూటింగ్ పెట్టారు. 'డబ్బులు కట్టేశాం. మళ్ళీ ఆ లొకేషన్ దొరకదు. ఆర్టిస్టుల డేట్స్ లేవు' అని అనడంతో మిస్ అయ్యా.  

ప్రస్తుతం అంజి దర్శకత్వంలోనే ఒక సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. నా కోసం రసూల్ కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?