Advertisement

Advertisement


Home > Movies - Movie News

జై బాలయ్య…ఫిక్స్

జై బాలయ్య…ఫిక్స్

మొత్తానికి బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిపోయినట్లే. జై బాలయ్య టైటిల్ నే ఫిక్స్ చేసారని బోగట్టా. ఈ టైటిల్ తో పాటు మరి కొన్ని టైటిల్స్ వినిపించాయి కానీ ఈ టైటిల్ కే యూనిట్ మొగ్గు చూపింది. దాంతో ఈ టైటిల్ నే అనౌన్స్ చేయబోతున్నారు. 

రాయలసీమ అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను రాసుకున్నారు. పక్కా మాస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తయారవుతోంది.

బోయపాటి స్టయిల్ ఎలివేషన్లు సినిమా నిండా పరుచుకుంటాయని తెలుస్తోంది. అలాగే పొలిటికల్ పంచ్ లు కూడా వుంటాయని టాక్. బాలకృష్ణ ఫ్యాన్స్ ఊతపదం జై బాలయ్య. అంతకన్నా క్యాచీ టైటిల్ వుండదు. అందుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసారు.

అఖండ సినిమాతో బాలయ్య సినిమాకు హాట్ ఫేవరెట్ అయిపోయిన ధమన్ నే ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారు. గోపీచంద్ మలినేని ఫ్యావరెట్ హీరోయిన్ శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయిక. 

ఈ సినిమాకు ముందుగా అన్నగారు అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ మళ్లీ ఆ టైటిల్ అనిల్ రావిపూడి సినిమాకు అని వినిపించింది. మొత్తానికి జై బాలయ్యనే ఫిక్స్ చేసారని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?