Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధ‌మైన పృథ్వీరాజ్‌!

ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధ‌మైన పృథ్వీరాజ్‌!

ప్ర‌త్య‌ర్థుల‌కు బాలిరెడ్డి పృథ్వీరాజ్ ఆయుధ‌మ‌య్యారు. తాజాగా ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్‌కు షాక్ ఇచ్చింది. ప్ర‌తినెలా రూ.8 ల‌క్ష‌లు చొప్పున భ‌ర‌ణం కింద భార్య శ్రీ‌ల‌క్ష్మికి చెల్లించాల‌ని విజ‌య‌వాడ ఫ్యామిలీ కోర్టు జ‌డ్జి ఇందిరా ప్రియ‌ద‌ర్శిని తీర్పునిచ్చారు. ఈ నేప‌థ్యంలో పృథ్వీరాజ్‌ను అడ్డుపెట్టుకుని ప్ర‌త్య‌ర్థులు జ‌నసేన‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. జ‌న‌సేన‌లో చేరాలంటే భార్య‌ల‌కు భ‌ర‌ణం చెల్లించ‌డ‌మే అర్హ‌తా? అంటూ సెటైర్స్ విసురుతున్నారు.

ఆవు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా అంటూ ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌త జీవితంపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అధినేతే ఒక‌రికి బ‌దులు ఇద్ద‌రికి భ‌ర‌ణం చెల్లించి, ముచ్చ‌ట‌గా మూడో మ‌హిళ‌తో కాపురం చేస్తున్నార‌ని, ఆయ‌న పార్టీలో చేరాలంటే క‌నీసం ఒక‌రికైనా భ‌ర‌ణం చెల్లించ‌క‌పోతే ఎలా? అని ప్ర‌త్య‌ర్థి పార్టీల సోష‌ల్ మీడియాలో సెటైర్స్ విస‌ర‌డం గ‌మ‌నార్హం.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు పృథ్వీరాజ్ వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వైసీపీకి అందించిన సేవ‌ల‌ను గుర్తించి ఆయ‌న‌కు ఎస్వీ భ‌క్తి చాన‌ల్ చైర్మ‌న్ బాధ్య‌త‌ల్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అప్ప‌గించారు. అయితే ప్ర‌పంచ ప్ర‌సిద్ధ‌గాంచిన టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చాన‌ల్ కీల‌క పోస్టులో ఉంటూ, ఓ మ‌హిళ‌తో స‌ర‌స సంభాష‌ణ‌లు చేస్తూ ప‌ద‌విని పోగొట్టుకున్నారు.

ఆ త‌ర్వాత క్ర‌మంగా వైసీపీకి దూర‌మ‌వుతూ, జ‌న‌సేన‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఆ మ‌ధ్య జ‌న‌సేన నాయ‌కుడు నాగేంద్ర‌బాబును క‌లిసి పార్టీలో చేరిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురు కావ‌డంతో జ‌న‌సేన నేత‌ల‌పై సెటైర్స్ విసురుతున్నారు. 

పృథ్వీ వ‌ల్ల జ‌న‌సేన‌కు న‌యా పైసా లాభం లేక‌పోయినా, ఆయ‌న మాట తీరు, తాజా ఉదంతం వ‌ల్ల చెడ్డ‌పేరు మాత్రం వ‌స్తోంద‌ని జ‌న‌సైనికులు వాపోతున్నారు. మ‌హిళ‌ల గౌర‌వం విష‌య‌మై జ‌న‌సేన నాయ‌కుల‌కు మాట్లాడే అర్హ‌తే లేద‌ని ప్ర‌త్య‌ర్థులు గ‌ట్టి కౌంట‌ర్లు ఇస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?