జాన్వి కపూర్ డేటింగ్ పై పుకార్లు ఇప్పటివి కాదు. చాన్నాళ్లుగా ఆమె రిలేషన్ షిప్ పై అనుమానాలు, కథనాలు ఎప్పటికప్పుడు బయటకొస్తూనే ఉన్నాయి. వాటికి మరింత బలం చేకూరుస్తూ తాజాగా మరోసారి ప్రియుడితో కనిపించింది జాన్వి. ఈసారి ఏకంగా ప్రియుడితో స్వామివారిని దర్శించుకుంది.
తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల సందర్శించింది జాన్వి. స్వామివారికి మొక్కులు చెల్లించింది. ఈసారి ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి ఆమె దర్శనానికి రావడం విశేషం. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడే ఈ శిఖర్.
ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్ గా ఉంది జాన్వి కపూర్. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తోంది. పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి జాన్వి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు కూడా.
ఇక రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్విని హీరోయిన్ గా తీసుకున్న విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. జాన్వి కపూర్ కు తెలుగులో ఇది రెండో సినిమా. త్వరలోనే ఆమె చరణ్ తో కలిసి సెట్స్ లో జాయిన్ అవుతుంది.
ఈమధ్య హీరోయిన్లు ఎవ్వరూ తమ రిలేషన్ షిప్స్ ను దాచే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడీ లిస్ట్ లోకి జాన్వి కపూర్ కూడా చేరింది.