జవాన్ ఫెయిల్యూర్ సీక్రెట్ ఇదేనా?

సాయి ధరమ్ తేజ్ తో రచయిత-దర్శకుడు బివిఎస్ రవి చేసిన సినిమా ‘జవాన్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. ఆ తరువాత ఇఫ్పటి వరకు మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు. రచయితగానే కొనసాగుతున్నారు. కానీ…

సాయి ధరమ్ తేజ్ తో రచయిత-దర్శకుడు బివిఎస్ రవి చేసిన సినిమా ‘జవాన్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. ఆ తరువాత ఇఫ్పటి వరకు మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు. రచయితగానే కొనసాగుతున్నారు. కానీ తన సినిమా ఫెయిల్యూర్ వెనుక అసలు రీజన్ ఏమిటి అన్నది ఇన్నాళ్లకు ఓపెన్ గా చెప్పుకొచ్చారు రవి. ఫ్యామిలీ మూవీస్ మద పట్టు వున్న దిల్ రాజు అనుభవం లేమితో, రా అవుట్ పుట్ చూసి, జడ్జ్ చేయలేక, తన చిత్తానికి కెలికేసి, ఇప్పుడు చూడు అనేసారు అని వెల్లడించారు గ్రేట్ ఆంధ్ర ఇంటర్వూలో.

తమిళ ధృవ తయారీలో వుండగానే తన జవాన్ కూడా రెడీ అయిందని, రెండింటికీ పోలికలు యాధృచ్ఛికం అని ఆయన వెల్లడించారు. ధృవ తో పోలికలు వుండడంతో, ఆ సినిమా కన్నా ముందు తమ సినిమా వేయడం, సరైన చర్య కాదని, ఫ్యామిలీ సంబంధాలు కీలకం అని హీరో సాయి ధరమ్ తేజ్ భావించడంతో వెనక్కు తగ్గామని, అది కూడా కొంత మైనస్ అయిందని అన్నారు.

తొలి సినిమా వాంటెడ్ నాటికి తనకు అనుభవం లేదని, అది దెబ్ల తీసిందని రవి వెల్లడించారు. థాంక్యూ సినిమా కథ తన కుటుంబంలోనే పుట్టిందని, అది అలా అలా డెవలప్ చేసామని అన్నారు. శ్రీనివాస కళ్యాణం సినిమా హిట్ అయి వుంటే సతీష్ వేగ్నిశ ఈ ప్రాజెక్టు టేకప్ చేసి వుండేవారని, కానీ అలా జరగకపోవడంతో విక్రమ్ కే కుమార్ దగ్గరకు వెళ్లిందని అన్నారు.

అరవింద్ గారి అడ్వాన్స్ తన దగ్గర వుందని, ఎలాగూ అది వుందని పిలిపించి అన్ స్టాపబుల్ చేతిలో పెట్టారని, సిన్సియర్ గా వర్క్ చేసానని అన్నారు. చంద్రబాబును కలసి అన్నీ వివరించడం, అలాగే పవన్ ను కలిసి మాట్లాడడం ఇలాంటివి మరిచిపోలేని అనుభూతులు అన్నారు.