కిరణ్ అబ్బవరం ‘బ్రేకప్ పార్టీ’

సినిమా తీయడం, విడుదల చేయడం కన్నా ప్రమోషన్ పెద్ద సమస్య అయింది. భారీ ఖర్చు తప్పడం లేదు. సినిమాకు మంచి ఓపెనింగ్ తీసుకురావాలంటే ఇలాంటి సర్కస్ ఫీట్లు తప్పడం లేదు.  Advertisement లేటెస్ట్ గా…

సినిమా తీయడం, విడుదల చేయడం కన్నా ప్రమోషన్ పెద్ద సమస్య అయింది. భారీ ఖర్చు తప్పడం లేదు. సినిమాకు మంచి ఓపెనింగ్ తీసుకురావాలంటే ఇలాంటి సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. 

లేటెస్ట్ గా బ్రేక్ అప్ పార్టీ అరేంజ్ చేసాడు హీరో కిరణ్ అబ్బవరం. తన తాజా సినిమా వినరో భాగ్యము విష్ణు కథ కోసమే. వరంగల్ లోని కే స్ట్రీట్ లో ఒక బ్రేకప్ పార్టీ ను సెలెబ్రేట్ చేయనుంది. ఈ బ్రేకప్ పార్టీకి నిర్మాత బన్నీ వాసు, హీరో కిరణ్ అబ్బవరం హాజరు కానున్నారు.

కొద్ది రోజుల క్రితం ఇదే సినిమా కోసం గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” పోందుకున్న ప్లేయర్ తో ఆ సినిమాలోని సెకండ్ సింగిల్ ను లాంచ్ చేయించింది చిత్రబృందం.

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కింది. ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన “వాసవసుహాస” పాటకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.