పక్క పక్కన మూడు సెట్ లు, అరడజను కెమెరాలు, డజనకు పైగా మోనిటర్లు, ఉరకలు.. పరుగులు, ఇందందా పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ లతో చేస్తున్న సినిమా హంగామానే. ఇటీవలి కాలంలో ఏ పెద్ద సినిమా కూడా ఇంత జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకున్నది లేదు. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ ఇంత స్పీడ్ గా ఏ సినిమా చేసిందీ లేదు. అందులో ఇటీవల కాలంలో రాజకీయ కార్యకలాపాల కారణంగా ఏ విధంగా సినిమాలు చేస్తున్నదీ తెలిసిందే.
సముద్రఖని డైరక్షన్ లో ఓ తమిళ రీమేక్ ను దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసారు. తనే స్క్రిప్ట్, మాటలు అందించారు. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. సాయిధరమ్ తేజ్-పవన్ కీలకపాత్రలు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి 15 రోజులుగా చకచకా సాగుతోంది. ఒకటి రెండు రోజులు మినహా అన్ని రోజులు పవన్ షూటింగ్ కు హాజరయ్యారు. ఇది కాదు అసలు విషయం, దర్శకుడు సముద్రఖని ఉరకలు, పరుగులతో ఈ సినిమా షూటింగ్ చేయడం.
మూడు సెట్ లు పక్కపక్కనే..ఆరు కెమేరాలు..డజను మోనిటర్లు..ఈ సెట్ లో షాట్ కాగానే ఆ సెట్ లోకి పరుగు..అక్కడ కాగానే మరో దగ్గర..పట్టుమని పది నిమషాలు గ్యాప్ లేదు. ఈ తరహా పద్దతికి పవన్-తేజ్ ఇద్దరూ కొపరేట్ చేస్తున్నారు సరే, ఇంతకీ ఈ స్పీడ్ వెనుక వైనమేమిమి అంటే సముద్రఖనికి దాదాపు 1500 ఎపిసోడ్ లు టీవీ సీరియళ్లు తీసిన అనుభవమే నట. అక్కడ ఇలాగే ఫాస్ట్ గా రోజుకు నాలుగైదు ఎపిసోడ్ లు లాగించేస్తారు.
త్రివిక్రమ్ పక్కా బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వడంతో, సముద్రఖని సీన్ ఎంత వరకు కు కావాలో..అక్కడితో కట్ చెప్పి, ‘ఇది చాలు..ఇంత కన్నా ఎక్కువ అవసరం లేదు..ఇది రెండు నిమషాలే వాడే సీన్’ అని ముందుగానే చెప్పి, తరువాత సీన్ కు వెళ్లిపోతున్నారట. మార్చి నెలాఖరుకి పవన్ పోర్షన్ మొత్తం అయిపోతుందట. ఒక పాట మినహా మిగిలిన సినిమా అంతా దాదాపు పూర్తయిపోతుందట.
ఈ సినిమాను జూన్ లేదా ఆగస్టుల్లో విడుదల చేసే అవకాశం వుంది.కానీ గమ్మత్తేమిటంటే ఫ్యాన్స్ మాత్రం మాకు ఈ సినిమా కాదు, హరిహర వీరమల్లు కావాలి. ఓజి అంటున్నారు..అదేంటో.